చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన హైమద్ హుస్సేన్, అబూబకర్ అనే ఇద్దరు సోమవారం సాయంత్రం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో పట్టుకున్నట్లు తెలిపారు. విచారణలో వారు నగరంలోని 1, 3, 4వ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారని, దొంగిలించిన వస్తువులను భైంసాకు చెందిన నాంపల్లి వెంకటచారి, నాంపల్లి సాయిచరణ్‌కు విక్రయించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరి నుంచి 70 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, ఏడు చేతిగడియారాలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదుచేసి 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. ప్రజలు ఎవరైనా వేరే గ్రామాలకు వెళ్తే ఇంట్లో బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు ఉంచకూడదని సూచించారు.
ఇద్దరు నిందితులు..
నిజామాబాద్‌అర్బన్: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌కు చెందిన అమీర్‌ఖాన్, కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ హనీఫ్ అనే ఇద్దరు కొంత కాలంగా జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచూ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పక్కా సమాచారం మేరకు వీరిపై నిఘా ఉంచి పట్టుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు


