కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
నిజాంసాగర్(జుక్కల్): గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని మహమ్మద్‌నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అంధోల్ అశ్విని అన్నారు. మంగళవారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం, జుక్కల్ ఎమ్మెల్యే తోట.లక్ష్మీకాంతారావు సహకారం ఎంతో అవసరమన్నారు. నాయకులు చింతకింది కాశయ్య, మల్లయ్యగారి శివరాజ్, ఇఫ్తేకార్ దొర, తదితరులున్నారు.
మద్నూర్(జుక్కల్): నాందేడ్‌లోని గురుద్వారాను దర్శించుకునేందుకు హైదారాబాద్‌కు చెందిన ఇద్దరు భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మండల కేంద్రం గుండా హైదారాబాద్‌కు చెందిన మోహన్ సింగ్, తేజాసింగ్‌లు కాలి నడకన మహరాష్ట్రలోన నాందేడ్‌లో గల పవిత్ర గురుద్వారా దర్శనం కోసం వెళ్తున్నట్లు మంగళవారం వారు తెలిపారు. 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరామని, మరో రెండు రోజుల్లో నాందేడ్‌కు చేరుకుంటామని వారు సాక్షితో చెప్పారు. లోక కల్యాణం, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ పాదయాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ పాదయాత్ర చేపడతామని వారు అన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): సొంతిళ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని మహమ్మద్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి రాములుకు మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు కాలనీల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే కొత్త సర్పంచ్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులు చేయిస్తామన్నారు. నాయకులు లోక్యానాయక్, కమ్మరి కృష్ణ, నర్సింలు, శంకర్, గోపిసింగ్ తదితరులున్నారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం


