పోస్టల్ బ్యాలెట్ కేంద్రం పరిశీలన
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని మంగళవారం ఎంపీడీవో సంతోష్ కుమార్ పరిశీలించారు. మండలంలోని ఉద్యోగులు తమ ఓటును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడులపై రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిలతో కలిసి గడుగు గంగాధర్ ఆవిష్కరించారు.
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో టాస్క్ సౌజన్యంతో జియో కంపెనీలో వివిధ ఉద్యోగాల కోసం జాబ్ డ్రైవ్ నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రంగరత్నం మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు అనేక నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ, వాటికి అనుగుణమైన ఉద్యోగాల కోసం ప్రాంగణ నియామకాలను కూడా టీఎస్‌కేసీ చేపడుతుందన్నారు. జిల్లాలోని నవీపేట్, నందిపేట్, బాల్కొండ, వేల్పూర్, నిజామాబాద్ నుంచి సుమారు 200 మంది ఉద్యోగార్థులు ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు. వీరిలో 22 మంది మిగతా రౌండ్లకు ఎంపికయ్యారని టీఎస్‌కేసీ సమన్వయకర్త రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి భరత్‌రాజ్, ఆంగ్ల విభాగాధిపతి దండు స్వామి, టాస్క్ జిల్లా మేనేజర్ రఘు తేజ, టీఎస్‌కేసీ మెంటార్ శ్రీకాంత్, సంస్థ హెచ్ ఆర్‌లు మహవీర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కేంద్రం పరిశీలన
పోస్టల్ బ్యాలెట్ కేంద్రం పరిశీలన


