‘కాయకల్ప’పై శిక్షణ
నిజామాబాద్ నాగారం: నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లాస్థాయి ‘కాయకల్ప ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం’ నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో రాజరశ్రీ మాట్లాడుతూ.. ఆస్పత్రి పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, వేస్ట్ మేనేజ్మెంట్, హైజిన్ ప్రమోషన్ గురించి సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రోగ్రాం ఆఫీసర్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ రాజు మాట్లాడుతూ.. జన ఆరోగ్య సమితి సమావేశం గురించి తెలిపారు. టీబీ ముక్త్ భారత్, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు దేవి నాగేశ్వరి, సామ్రాట్ యాదవ్, ఆశోక్, రాజు, అశ్విని, శ్వేత, ఎంఎల్‌హెచ్‌పీలు తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులో ఎరువులు
నవీపేట: రబీ పంటల సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని డీఏవో వీరాస్వామి అన్నారు. మండలంలోని బినోల, నాగేపూర్, నవీపేట సొసైటీల గోదాములతోపాటు ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాల ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ పోస్’ పరికరం ద్వారా ఎరువుల అమ్మకాలను జరపాలని, రైతుల కు రసీదులను కచ్చితంగా ఇవ్వాలని సూ చించారు. గోదాములతోపాటు ఫెర్టిలైజర్ దుకాణాల్లోని రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆయన వెంట ఏవో నవీన్‌కుమార్ ఉన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 17 పరీక్ష కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 386 మందికి 374 మంది హాజరు కాగా 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
‘కాయకల్ప’పై శిక్షణ


