ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
● సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి శేఖర్
పిట్లం(జుక్కల్): గ్రామాన్ని అబివృద్ధి చెయ్యడానికి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, మీ చల్లని దీవెనలతో నన్ను సర్పంచ్‌గా ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సహకారంతో నిధులు తెచ్చి పిట్లం గ్రామపంచాయతీని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి శేఖర్ హామీ ఇస్తూ మంగళవారం పిట్లం మండల కేంద్రంలోని ప్రచారాన్ని ముమ్మురంగా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన తండ్రి కుమ్మరి సాయిలు గతంలో పిట్లం ఉప సర్పంచ్ గా సేవలందించారని పేర్కొన్నారు. తాను బీఎడ్ చదివిన ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా, పుట్టిన ఊరుని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాలలోకి వచ్చానని పేర్కొన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


