సర్పంచ్ బరిలో స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడు
పిట్లం(జుక్కల్): ఆశతో కాదు ఆశయంతో సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, మీ చల్లని దీవెనలతో నన్ను సర్పంచిగా లేడీ పర్సు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే, పిట్లంలో జన్మించిన ప్రతి ఆడబిడ్డను పిట్లం బంగారు తల్లిగా భావించి రూ.2 వేలు డిపాజిట్ చేస్తానని, సర్పంచ్ అభ్యర్థి నీలకంటి లోక మనోహర్ హామీ ఇస్తూ సోమవారం పిట్లం మండల కేంద్రంలోని పలు వార్డులలో ప్రచారాన్ని ముమ్మురంగా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడైన మా తండ్రి నీలకంటి నారాయణ గతంలో పిట్లం గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారని, పిట్లంలో వీధి దీపాలు, పాఠశాలల ఏర్పాటు, గ్రామానికి రహదారి ఏర్పాటు, మురికి కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేశారని పేర్కొన్నారు. తాను 20 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానని, అదృష్టవశాత్తు 20 ఏళ్ల తర్వాత బీసీకి సర్పంచ్‌గా నిలబడే అవకాశం వచ్చిందని, అందుకే బరిలో ఉన్నానని పేర్కొన్నారు.
గ్రామంలో జన్మించిన ప్రతి ఆడబిడ్డను బంగారు తల్లిగా భావించి రూ. 2 వేలు డిపాజిట్ చేస్తానని హామీ
సర్పంచ్ అభ్యర్థి
నీలకంఠ లోక మనోహర్


