అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
గాంధారి: కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సోమవారం రాత్రి గాంధారి–బాన్సువాడ రహదారిలో ప్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా గాంధారి నుంచి బాన్సువాడ వైసు వెళ్తున్న కారు ఆపకుండా వెళ్లిపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా అందులో 48 బీరు సీసాలతో పాటు నాలుగు లీటర్ల మద్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న బాన్సువాడ మండలంలో సంగోజీపేట్‌కు చెందిన మరాఠీ బాలును అదుపులోకి తీసుకుని మద్యాన్ని స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ప్రదీప్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


