బంధువులొచ్చారు..!
భిక్కనూరు: సర్పంచ్ పదవికి పోటీపడుతుండడంతో అభ్యర్థి చుట్టాలు భిక్కనూరు పరిధిలో వారి గ్రామాలకు చేరుకున్నారు. సర్పంచ్ అభ్యర్థుల వెంట తిరుగుతూ వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో గ్రామాలన్నీ చుట్టాలతో నిండిపోయాయి. అభ్యర్థులు సైతం తమ చుట్టాలకు తమ కుమారుల స్నేహితులకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తున్నారు. ముఖ్యంగా మద్యం కొనుగోలు చేసి తీసుకురావడం.. దాన్ని పంపిణీ చేయడం వంటి పనులతో పాటు ఇతర ముఖ్య పనులను కూడా వారికే అప్పగిస్తున్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పద్మాజీవాడి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సుబ్బారావు అన్నారు. సోమవారం పద్మాజీవాడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రధానంగా గ్రామంలో తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణాలు, వీధి దీపాలు తదితర అంశాలపై ప్రధాన దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. పద్మాజీవాడి చౌరస్తాలో తన సొంత నిధులతో బోరు వేయిస్తానని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి యువతకు అండగా నిలుస్తానన్నారు. ప్రతీ సంవత్సరం గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తానన్నారు. విద్యావంతుడినైన తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో ఈనెల 14న నిర్వహించనున్న ఎన్నికల కోసం అధికారులు సోమవారం ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశారు. మండలంలో 41 గ్రామ పంచాయతీలకు 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27 పంచాయతీలకు 148 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు.
రాజంపేట: రాజంపేట సర్పంచ్ బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు వారి వారి పంథాలో ప్రత్యేకతను చాటుతూ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన ఆముదాల నాగరాజుకు మద్దతుగా సోమవార జబర్దస్త్ టీం గడ్డం నవీన్, వినోదిని, ఫణి, కేఏ పాల్‌లు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కత్తెరు గర్తుకు ఓటు వేసి ఆముద నాగరాజును గెలిపించాలని వారు కోరారు. జబర్దస్త్ టీం ప్రచారానికి రావడంతో వారిని చూడటానికి జనాలు ఉత్సాహాన్ని చూపారు.
బంధువులొచ్చారు..!
బంధువులొచ్చారు..!


