మహిళా సంఘాల సభ్యులకు సర్టిఫికెట్‌ల ప్రదానం
కామారెడ్డి క్రైం: ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో ఐదు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సంఘాల సభ్యులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. తన చాంబర్‌లో మంగళవారం సర్టిఫికేట్‌లను అందజేశారు. జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. డీఆర్డీవో సురేందర్, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, అధికారులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను అధికారులు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. ఈ నెల 14న రెండో విడతలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు రావడంతో ఎంపీవో ప్రకాష్ సిబ్బందితో కలిసి ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో భద్ర పరిచారు.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించి క్షేత్ర స్థాయిలో యాసంగిలో సాగు చేసిన మొక్కజొ న్న పంటను పరిశీలించినట్లు ఏవో రాజలింగం తెలిపారు. మొక్కజొన్నలో కాండం తొలిచే పరుగు, ఎండాకు తెగులు ఆశించినట్లు గుర్తించి సంబంధిత రైతులకు సస్యరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిచికారీ చేయాల్సిన పురుగు మందులను సూచించినట్లు తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులకు సర్టిఫికెట్‌ల ప్రదానం
మహిళా సంఘాల సభ్యులకు సర్టిఫికెట్‌ల ప్రదానం


