బ్యాలెట్ పేపర్‌పై గుర్తులు మాత్రమే!
ఓటర్లు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు
● అభ్యర్థుల పేర్లు ఉండవు
భిక్కనూరు: గ్రామ భవిష్యత్తుకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అంత్యంత కీలకంగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి గుర్తులు మాత్రమే బ్యాలెట్ పేపర్‌పై ఉంటాయి. బ్యాలెట్‌పై పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల పక్కనే ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు అంటే రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు అయితే ఆ రాజకీయ పార్టీ గుర్తు, ఇండిపెండెంట్ అయితే ఎన్నికల సంఘం వారికి కేటాయించిన గుర్తు ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసే అభ్యర్థుల పేర్లు బ్యాలెట్ పేపరుపై ఉండవు. దీంతో ఓటర్లకు గుర్తు గురించి అభ్యర్థులు పలుమార్తు చెప్పి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్‌పై గుర్తులు తప్ప పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం అభ్యర్థులకు తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. అవగాహన లేకపోతే ఓటు వేరొకరికి పడే ప్రమాదం ఉంది. ఇది తమకుతీవ్రమైన నష్టం కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు.
● తాము ఓటు వేయాలనుకునే అభ్యర్థి ఎన్నికల గుర్తును కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి
● ఇంట్లోని వృద్ధులు, మహిళలకు కొత్త ఓట ర్లకు ఈ విషయాన్ని వివరించాలి.
● పోలింగ్ బూత్ వద్ద తొందరపడి గుర్తు చూడకుండా ఓటు వేయొద్దు.
● బ్యాలెట్ పేపరుపై ఉన్న గుర్తును సరిగా చూసిన తరువాతనే ఓటు వేయాలి.
● ఈ విషయాలను ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతై నా ఉందని పలువురు అంటున్నారు. యు వతతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు ఉండవని, గుర్తులు మాత్రమే ఉంటాయని ప్రజల కు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


