మేజర్‌ పంచాయతీ అంటే.. | - | Sakshi
Sakshi News home page

మేజర్‌ పంచాయతీ అంటే..

Dec 8 2025 7:48 AM | Updated on Dec 8 2025 7:48 AM

మేజర్

మేజర్‌ పంచాయతీ అంటే..

మీకు తెలుసా..

‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..?

సదాశివనగర్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు ఎవరూ నచ్చకపోతే నోటా(నన్‌ ఆఫ్‌ ది ఎబో) గుర్తుకు ఓటేసే అవకాశాన్ని ఈ సారి రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. పోటీలో ఉన్న అభ్యర్థుల కన్నా అధికంగా ఓట్లు నోటాకు వచ్చినా ఎన్నిక రద్దయ్యే అవకాశం లేదు. ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారం నోటాకు అందరికన్నా ఎక్కువ ఓట్లు పోలైనా తర్వాత ఓట్లు వచ్చినా అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. నోటాకు అధికంగా ఓట్లు పోలైనప్పుడు ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నోటాకు వచ్చిన ఓట్ల కన్నా తక్కువ సాధించిన అభ్యర్థులను తదుపరి ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని అప్పట్లో పిటిషన్‌లో కోరారు. దీన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల సంఘానికి ఈ విషయంలో నోటీసులు జారీ చేసింది. అయినా ఇప్పటి వరకు ఈ అంశంపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పీపుల్స్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌(పీయూసీఎల్‌) వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈవీఎంలలో నోటా మీటను ఏర్పాటు చేశారు. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు నచ్చకపోతే నోటా గుర్తుకు ఓటేసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

సదాశివనగర్‌: మేజర్‌ పంచాయతీ అంటే సాధారణ గ్రామాలతో పోలిస్తే జనాభా, ఆదాయం ఎక్కువగా ఉండి, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కువ నిధులు, వన రులు అందుబాటులో ఉండే ఒక పెద్ద గ్రామ స్థానిక స్వపరిపాలన సంస్థ. దీనికి ఎక్కువ బడ్జెట్‌తో పాటు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులు ఉంటాయి. ఇది చిన్న గ్రామ పంచాయతీల కంటే ఎక్కువ అధికారాలను కలిగి ఉంటుంది.

ముఖ్య లక్షణాలు:

అధిక పన్నులు, ప్రభుత్వ గ్రాంట్లు, ఇతర ఆదాయ మార్గాల వల్ల ఆర్థికంగా బలంగా ఉంటుంది.

పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రోడ్లు, నీటి సరఫరా వంటి వాటిపై ఎక్కువ ఖర్చు చేయగలదు.

పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి, ఒక కార్యనిర్వహణ అధికారి లేదా పంచాయతీ కార్యదర్శి వంటి అదనపు సిబ్బందిని నియమించుకోవచ్చు.

ప్రభుత్వ అభివృద్ధి పథకాల్లో ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఎన్నికల సమయంలో కూడా ఎక్కువ ఖర్చు, డిమాండ్‌ ఉంటుంది.

చిన్న గ్రామ పంచాయతీకి రూ. లక్ష వరకు ఖర్చు చేసే అవకాశం ఉంటే, మేజర్‌ పంచాయతీలకు అంతకంటే ఎక్కువ నిధులు అందుబాటులో ఉంటాయి.

సంక్షిప్తంగా, మేజర్‌ పంచాయతీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా, జనాభా పరంగా బలంగా ఉండి, మెరుగైన పాలన అందించే ఒక పెద్ద గ్రామ స్వపరిపాలనా విభాగం.

పంచాయతీ రిజిస్టర్లు ఇవే..

డిచ్‌పల్లి: గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్‌. ప్రజాస్వామ్య వ్యవస్థలో చెక్‌ పవర్‌తో పాటు విశేషమైన అధికారులు ఉంటాయి. గ్రామపంచాయతీలో నిర్వహించాల్సిన రిజిస్టర్లు ఇలా ఉన్నాయి.

గ్రామపంచాయతీ సమావేశపు ఎజెండా నోటీసు రిజిస్టర్‌

సభ్యుల హాజరు రిజిస్టర్‌

మినిట్స్‌ తీర్మానాల రిజిస్టర్‌

గ్రామసభ ఎజెండా నోటీను రిజిస్టర్‌

గ్రామసభ సభ్యుల హాజరు రిజిస్టర్‌

గ్రామసభ తీర్మానాలు–మినిట్స్‌

నగదు పుస్తకం(క్యాష్‌బుక్‌)

ఇంటి పన్ను డిమాండ్‌ రిజిస్టర్‌

నెలవారీ నల్లా రుసుం డిమాండ్‌ రిజిస్టర్‌

వ్యాపార లైసెన్సు రిజిస్టర్‌

గృహ నిర్మాణాల అనుమతుల రిజిస్టర్‌

ఆదాయం వచ్చు ఆస్తుల రిజిస్టర్‌

చెల్లింపుల కోసం బిల్లులు పాస్‌ చేసిన రిజిస్టర్‌

చిల్లర పాటల రిజిస్టర్‌

ధర్మాదాయాల, ధర్మనిధుల రిజిస్టర్‌

అక్విటెన్సు రిజిస్టర్‌

ఆడిట్‌ రిజిస్టర్‌

డీసీబీ రిజిస్టర్‌

స్టాక్‌ రిజిస్టర్‌

టూల్స్‌ అండ్‌ ప్లాంట్స్‌ రిజిస్టర్‌

మనీ వాల్యు రిజిస్టర్‌

మేజర్‌ పంచాయతీ అంటే..1
1/1

మేజర్‌ పంచాయతీ అంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement