పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం

Dec 8 2025 7:48 AM | Updated on Dec 8 2025 7:48 AM

పోస్ట

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం జీపీ కార్మికుడిగా రాజీనామా చేసి సర్పంచ్‌ బరిలో.. మాక్లూర్‌లో పోలీసుల కవాతు మహిళ బ్యాగ్‌ చోరీ

రాజంపేట: మండలంలో ఆదివారం మండల పరిషత్‌ కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 19 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు స్థానిక ఎంపీడీవో బాలకృష్ణ తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సరళిని జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌ సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు

భిక్కనూరులో 31 పోస్టల్‌ ఓట్లు

భిక్కనూరు: మండలానికి చెందిన 31 మందికి చెందిన పోస్టల్‌ ఓట్లు ఆదివారం పోలయ్యాయని భిక్కనూరు ఎంపీడీవో రాజకిరణ్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఈనెల 9 తేది వరకు తమ ఓటును పోస్టల్‌ బ్యాలెట్‌ రూపకంగా వేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో వేయాలని కోరారు.

బీబీపేట: మాందాపూర్‌ జీపీ కార్మికుడిగా పని చేస్తూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా చేస్తున్న సడుగు మల్లేశం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం ఎన్నికల్లో సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్నారు. మాందాపూర్‌లో ప్రస్తుతం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మల్లేశం జీపీ కార్మికుల హక్కుల కోసం చాలా సార్లు ఉద్యమంలో పాల్గొన్నారు. గ్రామంలో జనరల్‌కు రిజర్వేషన్‌ రావడంతో పోటీలో నిలబడ్డారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని, ప్రతి అభివృద్ధిలో ముందంజలో ఉంటానని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

మాక్లూర్‌: మండల కేంద్రంలో పోలీసులు ఆదివారం కవాతు నిర్వహించారు. సర్పంచ్‌ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని పోలీసులు కోరారు. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి నార్త్‌జోన్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సైలు రాజశేఖర్‌, తిరుపతి, గంగాధర్‌, మొగులయ్య పోలీసు సిబ్బందితో కలిసి మండల కేంద్రంతో పాటు కల్లెడి గ్రామాల్లో భారీ కవాతు చేపట్టారు. ఈ నెల 14న చేపట్టే ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూడాలన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనిక ఓరారు. కవాతులో పోలీసులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో ఓ మహిళ బస్సు ఎక్కే క్రమంలో మరో మహిళ బ్యాగ్‌ దొంగిలించింది. ఈ ఘటనకు సంబంధించి ఒకటో టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుష్క అనే మహిళ హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌కు ఆదివారం రైలులో వచ్చింది. ఆమె బోధన్‌కు వెళ్లేందుకని రైల్వేస్టేషన్‌ ఎదుట ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ఆమె వెనుకాల ఉన్న ఓ వృద్ధ మహిళ బాధితురాలి బ్యాగ్‌ను దొంగిలించింది. కొద్దిసేపటికి బ్యాగ్‌ కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగులో 4.7 తులాల బంగారం, రూ. రెండు వేల నగదు ఉన్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఓ వృద్ధ మహిళ బాధితురాలి బ్యాగ్‌ను దొంగిలిస్తున్నట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా  ఓటు హక్కు వినియోగం  
1
1/2

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా  ఓటు హక్కు వినియోగం  
2
2/2

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement