పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● అభివృద్ధికి పట్టం కట్టాలి
● ప్రభుత్వ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
రుద్రూర్: పేదల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ఓపిక ఉన్నంత వరకు లక్ష్య సాధనకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువా డ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్‌లో ఆదివారం సర్పంచ్ మద్దతుదారు వసంత తరఫున ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు ఎన్నికై పని చేయని వారిని ఓడించాలని, అభివృద్ధి చేసిన వారిని గెలిపించాలని అన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన కలిగి ఉండి పరిష్కరించే వ్యక్తి సర్పంచ్‌గా ఉండాలని స్పష్టం చేశారు. మండల కేంద్రంలో అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం రూ. కోట్లు కేటాయించానని అన్నారు.
సమావేశంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సర్పంచ్ అభ్యర్థి వసంత, జెడ్పీటీసీ నారోజి గంగారాం, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, విండో చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.


