పోచారంలో ఏకగ్రీవమే ఆచారం..!
బాన్సువాడ రూరల్: నాలుగు దశాబ్దాలుగా ఏకగ్రీవ పంచాయతీగా రికార్డు సాధించిన బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఈసారి కూడా అదే ఆచారం కొనసాగనుంది. గ్రామస్తులు కేతావత్ రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా అదే గ్రామానికి చెందిన నరేష్ రాథోడ్ విభేదించి నామినేషన్ దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. నరేష్ రాథోడ్ నామినేషన్ పత్రాన్ని బలపరిచిన గులాబ్ సింగ్ అనే వ్యక్తి.. తనతో బలవంతంగా సంతకం చేయించారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను స్క్రూట్నీలో కొట్టేశారు. కాగా ఆదివారం నరేశ్ రాథోడ్ బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ సహకారంతో అప్పీల్‌కు వెళ్తాడని, కోర్టును ఆశ్రయిస్తాడనే ఊహాగానాలు వచ్చాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ అజ్ఞాతం వీడిన నరేష్ రాథోడ్ గ్రామస్తుల నిర్ణయం మేరకే నడుచుకుంటానని ప్రకటించినట్లు తెలిసింది. దీంతో ఈసారి కూడా బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామం పోచారం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.
డిచ్‌పల్లి(జక్రాన్‌పల్లి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘా తం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి సూచించారు. ఆదివారం జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. డిచ్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వినోద్, జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్‌లతో శాంతిభద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు, హాట్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించాలన్నారు. ప్రతి గ్రామానికి తగిన బందోబస్తు, సిబ్బంది కేటాయింపు, పికెటింగ్, గస్తీ, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డిచ్‌పల్లి సీఐ, జక్రాన్‌పల్లి ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.
పోచారంలో ఏకగ్రీవమే ఆచారం..!


