సాయిబాబా ఆలయ కమిటీ కార్యవర్గం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణం విద్యానగర్ సాయిబాబా దేవాలయ నూతన కమిటీని ఆదివా రం ఎన్నుకున్నారు. మాజీ కౌన్సిలర్లు మోతే కృష్ణా గౌడ్, కుంబాల రవియాదవ్, కొక్కొండ రవీందర్ స మక్షంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా రా జూరి మనోహర్, వర్కింగ్ అధ్యక్షుడిగా పొగాకు శ్రీనివాస్, కార్యదర్శిగా కై లాస్ సంతోష్, కోశాధికారి గా జక్సాని చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. అనంతరం ప్రతినిధులను సన్మానించారు. ఆలయ కమిటీ మాజీ ప్రతినిధులు పి.రాజమౌళి, వాసరయ్య, బి.సీతారామారావు, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


