క్రైం కార్నర్
కుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ఆర్మూర్ టౌన్: పెర్కిట్‌లోని ఓ ట్రాక్టర్ షోరూమ్ వెనకాల ఉన్న కుంటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మృతుడి ఒంటిపై ఎర్రటి దుస్తులు ఉన్నాయని, వ యసు 45 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచామని పేర్కొన్నారు. మృతుడి సమాచారం తెలిస్తే ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు మృతి
కామారెడ్డి క్రైం: కత్తిపోటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రామేశ్వర్‌పల్లి గ్రామస్తులు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని రామేశ్వర్‌పల్లి వద్ద బుధవారం రాత్రి కత్తిపోట్ల ఘటన చోటు చేసుకుంది. పాత కక్షలను మనసులో పెట్టుకొని రామేశ్వర్‌పల్లి వద్దనున్న డబుల్ బెడ్‌రూం కాలనీకి చెందిన గంగని ప్రవీణ్ అనే వ్యక్తి అదే కాలనీకి చెందిన రాజశేఖర్‌పై కత్తితో దాడి చేశాడు. రాజశేఖర్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని మూడో టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఖానాపూర్ చౌరస్తా వద్ద బీహార్‌కు చెందిన రాంనాఽఽథ్ మెహతా గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రెండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన ఏడుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.


