43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
గాంధారి(ఎల్లారెడ్డి): రెండో విడత జీపీ ఎన్నికల్లో సుమారు 43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమ య్యా యి. వాటిలో గాంధారి మండలంలోని 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ఎంపీడీవో రాజేశ్వర్ శనివారం తెలిపారు. మండలంలో మొ త్తం 45 గ్రామ పంచాయతీలున్నాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
లింగంపేట మండలంలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. 41 గ్రామ పంచాయతీలకు గాను 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 27 గ్రామ పంచాయతీలకు 109 మంది బరిలో నిలిచినట్లు ఎంపీడీవో నరేష్ తెలిపారు. అలాగే 342 వా ర్డు సభ్యులకు 194 వార్డులు ఏకగ్రీవం ఆయ్యాయి. 148 వార్డులకు 512 మంది సభ్యులు బరిలో ఉండడంతో వాటిలో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.
అలాగే ఎల్లారెడ్డి మండలంలో 4, మహమ్మద్ నగర్, పిట్లం ఒక్కో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.
లింగంపల్లి(ఖుర్దు)..
లింగంపేట మండలంలోని లింగంపల్లి(ఖుర్దు) జీపీ ఏకగ్రీవమైంది. సర్పంచ్ పదవి కోసం ఇద్దరు వ్యక్తులు నామినేషన్ దాఖలు చేయగా, ఇటీవల ఒకరు నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో గొల్ల ప్రత్యూష సర్పంచ్‌గా ఏకగ్రీవమైంది. అలాగే ఉపసర్పంచ్ దాసారం సంతోష్, వార్డు సభ్యులు బండి అశోక్, చౌడం సరిత, బండి సావిత్రి, దాసారం సంతోష్, పోతరాజు లక్ష్మన్, నాని, రాజు, కుమ్మరి పద్మ ఏకగ్రీవమయ్యారు.
నాగిరెడ్డిపేట మండలంలో..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలో మొత్తం 27 సర్పంచ్ స్థానాలకుగానూ 6 సర్పంచ్‌స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 21 సర్పంచ్‌స్థానాలకు 70మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మండలంలో మొత్తం 232 వార్డు స్థానాలుండగా వాటిలో 103 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 129 వార్డు స్థానాలకు 282మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నాం వరకు నామినేషన్ల విత్‌డ్రాకు గడువు ముగియడంతో ఎన్నికల అధికారులు ఎన్నికల్లో పోటీచే సే అభ్యర్థుల పేర్లతోపాటు వారికి కేటాయించిన గుర్తులతో కూడిన తుదిజాబితాను రూపొందించి నామినేషన్ల స్వీకరణకేంద్రాల బయట గోడలపై అ తికించారు. దీంతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను చూసుకునేందుకు పోటీ పడ్డారు.
మల్లూర్ తండా..
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మల్లూర్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్ స్థానానికి ముగ్గురు నామినేషన్లు వేయగా, వార్డు స్థానాలకు మాత్రం ఒక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. అయితే సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోవడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం అయ్యింది. సర్పంచ్‌గా కేతావత్ నారాయణ, ఉప సర్పంచ్‌గా వెంకట్రాం ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా మోతిరాం, ఇస్లావత్ సంగీత, ప్రకాష్, నిర్మల, మారోని, సంతోష్, సుమలత ఏకగ్రీవమయ్యారు.
నాగిరెడ్డిపేటలో విచిత్ర పరిస్థితి..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామపంచాయతీ పాలకవర్గానికి జరుగనున్న ఎన్నికలో వింతపరిస్థితి నెలకొంది. సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్‌స్థానంతోపాటు 10 వార్డు స్థానాలున్నాయి. సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ కాగా, గ్రామానికి చెందిన మన్నె వెంకట్‌తోపాటు మరోవ్యక్తి నామినేషన్ వేశారు. సదరు వ్యక్తి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో వెంకట్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతోపాటు గ్రామపంచాయతీ పరిధిలోని 1,3,6,7,8వార్డు స్థానాలు ఏకగ్రీవమవ్వగా 2,4,5,9,10వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
గాంధారి మండలంలో 16, లింగంపేట
మండలంలో 14, నాగిరెడ్డిపేట మండలంలో 6
ఎల్లారెడ్డి మండలంలో 4, పిట్లం, మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఒక్కో స్థానం చొప్పున ఏకగ్రీవం
43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం


