చిరుత సంచారం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గాంధీనగర్, మోతె గ్రామాల గేటు మధ్య చిరుత సంచరించినట్లు ప్రయాణికులు తెలిపారు. శుక్రవారం రాత్రి కామారెడ్డి, ఎల్లారెడ్డి కేకేవై రోడ్డు పక్కన చిరుత కనిపించినట్లు వాహన చోదకులు తెలిపారు. దీంతో గాంధీనగర్, బూరుగిద్ద, మోతె, ఎల్లమ్మతండా వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.అటవీ శాఖ అధికారులు చిరుతను బందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎల్లారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు శనివారం సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డికి చెందిన పవన్‌కు భార్య సుజాతతో ఇటీవల గొడవ జరిగింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన పవన్ పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ ఎక్కాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పవన్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. దీంతో పవన్ టవర్ దిగి కిందికి రావడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కామారెడ్డిలో
ఒకరి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలోని కాకతీయ నగర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అంబీర్ రాజు (45) కుటుంబంతో కలిసి కొన్నేళ్లుగాగా జిల్లా కేంద్రంలోని కాకతీయ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజు భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో అతడు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి వెంటనే దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
9న జాబ్‌మేళా
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కా లేజీలో ఈ నెల 9న రిలయన్స్, జియోలో ఉ ద్యోగాలకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా టాస్క్ మేనేజర్ రఘు తేజ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆ ధ్వర్యంలో రిలయన్స్, జియో ద్వారా రిక్రూట్‌మెంట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. పా యింట్ మేనేజర్ పోస్టుకు రూ.3.36 లక్షల వా ర్షిక వేతనం, అసిస్టెంట్ పాయింట్ మేనేజర్ పోస్టుకు రూ.2.10 లక్షల వార్షిక వేతనంతో ఉ ద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నందిపేట్, నవీపేట్, వేల్పూర్, బాల్కొండ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని, పురుషులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. డిగ్రీ, ఇంట ర్, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు అర్హులని, స్థానికులకే అవకాశాలు కల్పిస్తామన్నారు.
పోలీసుల తనిఖీలు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో శనివారం రాత్రి నిషేధిత మాదకద్రవ్యాలపై ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పాతబస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగులు, హోటళ్లు, పాన్‌షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్ ద్వారా తనిఖీలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చిరుత సంచారం


