ఒకే కుటుంబం నుంచి మూడోసారి..
బీబీపేట: సర్పంచ్ పదవిపై ఉన్న ఆసక్తితో ఆ కుటుంబాలు మూడోసారి సైతం బరిలో నిలిచి తమ సత్తా చూపించేందుకు సిద్ధమయ్యాయి. మండలంలోని ఇస్సానగర్ గ్రామంలో 2013–18 వరకు ఉప్పునూతుల రమణాగౌడ్ సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 2018–23 వరకు ఆయన భార్య ఉప్పునూతుల కవిత సర్పంచ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఇస్సానగర్‌లో బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో రమణాగౌడ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే జనగామ గ్రామంలో 2006–11 వరకు మట్ట శ్రీనివాస్ సర్పంచ్‌గా కొనసాగారు. తర్వాత 2013–18 వరకు ఆయన భార్య స్వరూప అయిదేళ్లు పదవిలో ఉన్నారు. ప్రస్తుతం బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో శ్రీనివాస్ మరోసారి బరిలో ఉన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని మాచాపూర్ కారోబార్‌గా పని చేస్తు న్న ఖాజాపాషా కారోబార్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. మా చాపూర్ జీపీలో అతడు 15 సంవత్సరాలుగా కారోబార్‌తోపాటు మల్టీపర్పస్ వర్కర్‌గా పని చేస్తు గ్రామానికి సేవలందిస్తున్నాడు. జీపీకి సంబందించి సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌గా రిజర్వేషన్ రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పత్రాన్ని ఎంపీడీవోకు అందించారు. అనంతరం సర్పంచ్‌గా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. తనను సర్పంచ్‌గా గెలిపించాలని గ్రామ ఓటర్లను వేడుకుంటున్నారు.
వేల్పూర్: మండలంలోని పచ్చలనడ్కుడ మాజీ సర్పంచ్ కోల్లే నర్సయ్య ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటీవల ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చారు. దశాబ్ద కాలంగా ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో పచ్చలనడ్కుడ సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌గా రిజర్వు అయింది. ఆయన బీసీ కావడంతో మళ్లీ సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఇజ్రాయెల్ నుంచి వచ్చారు. 2008లో పచ్చలనడ్కుడలో సర్పంచ్ స్థానం జనరల్‌గా ఉన్నప్పుడు పోటీచేసి గెలిచారు. అంతకుముందు 2003 నుంచి 2008 వరకు ఆయన భార్య కోల్లే మణి సర్పంచ్‌గా కొనసాగడం విశేషం.
ఒకే కుటుంబం నుంచి మూడోసారి..


