ఘన్‌పూర్ దివంగత సర్పంచ్ భూమయ్య తీరేవేరు
మాచారెడ్డి: ప్రస్తుతం గ్రామాల్లో పంచాయతీ ఎ న్నికలు కొనసాగుతుండటంతో మాచారెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) గ్రామ సర్పంచ్‌గా రెండు పర్యాయాలు పనిచేసిన సాడెం భూమయ్య చేసి న సేవలను ప్రజలు గుర్తుకుతెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన భూమయ్యకు భార్య, పిల్లలు లేరు. 1991లో గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో భూమయ్యను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భూమయ్య ఉద యం లేవగానే సైకిల్‌పై ఊరంతా కలియతిరిగేవాడు. నల్లాల మోటార్లు చెడిపోయినా, పైపులై న్లు పగిలిపోయినా వాటర్మెన్‌తో కలిసి తాను వెళ్లి మరమ్మతులు చేసేవాడని గ్రామస్తులు చెబుతారు. తన వెంట ఉన్న చేతిసంచిలో సర్పంచ్, పంచాయతీ స్టాంపులు, ఇంక్‌ప్యాడు, దరఖాస్తు ఫారాలు పెట్టుకుని తిరుగుతూ పింఛన్లు రాని వా రికి దరఖాస్తుల మీద తన సంతకం, ముద్ర వేసి ఇస్తుండేవాడు. పది గంటలకు ఇంత సలిబువ్వ తినేసి సైకిల్ మీద మండల కార్యాలయాలకు వె ళ్లి అధికారులను కలిసేవాడు. ఓసారి భూమయ్య కలెక్టర్ వద్దకు వెళ్లి.. ‘ఓ సారూ నేను గన్‌పూర్ సర్పంచిని. నా పేరు సాడెం భూమయ్య. నువ్వు కలెక్టర్‌వట గద..’ అంటూ అప్పటి కలెక్టర్ చక్రపాణి చేయి పట్టుకుని చేతిలో ఉన్న దరఖాస్తును అందించాడు. తన చేయి పట్టుకున్న సాడెం భూ మయ్యతో ఆ కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడి ద రఖాస్తును చదివి వాటిని పరిష్కరించాడు. ఇలా ఐదేళ్ల పాటు ఆయన చేసిన సేవలతో గ్రామస్తులంతా ఆయన్ను ఎంతగానో అభిమానించేవారు. తరువాత 1996లో కూడా సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్ రిజర్వు కావడంతో భూమయ్య ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే పోటీకి మరొకరు రావడంతో ఎన్నిక జరిగింది. గ్రామస్తులు భూమయ్యనే గెలిపించారు. మరో ఐదేళ్లు ఆయన సర్పంచ్‌గా గ్రామస్తులకు సేవలందించాడు. 2001లో ఎస్టీ రిజర్వు కావడంతో భూమయ్య పోటీ చేసే అవకాశం చేజారింది. లే కుంటే మూడోసారి కూడా సర్పంచ్ అయ్యేవాడ ని గ్రామస్తులు చెబుతారు. 2011లో వృద్ధాప్యంతో చనిపోయాడు. రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేసిన భూమయ్య చిల్లిగవ్వ కూడా వెనుకేసుకోలేదు. తన అంత్యక్రియలను గ్రామస్తులే నిర్వహించారు. ఆయన హయాంలో జరిగిన అ భివృద్ధ్ది పనులు, జీపీ భవనం, బడి భవనం, నీ టిట్యాంకులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నా యని గ్రామస్తులు గుర్తు చేశారు.


