సర్పంచ్ బరిలో నాడు భార్య.. నేడు భర్త..
రాజంపేట: రాజంపేట గ్రామంరలో 2019 నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలలో గ్రామానికి చెందిన ఆముద సౌమ్య బరిలో నిలిచి సర్పంచ్‌గా గెలుపొందారు. అనంతరం గ్రామాభివృద్ధిలో భాగంగా సౌమ్య సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తన ప్రత్యేకతను చాటింది. ప్రతి యువతి వివాహానికి 25 కిలోల సన్న బియ్యం అందజేసింది. ప్రస్తుత ఎన్నికల్లో సౌమ్య భర్త నాగరాజు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచారు. నాగరాజుకు గతంలో గ్రామంలో ఉప సర్పంచ్‌గా చేసిన అనుభవం ఉంది. నాడు సతి పోటి పడగా నేడు పతి పోటీలో ఉండటం గమనార్హం.
మర్కల్‌లో నాడు భర్త.. నేడు భార్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ గ్రామంలో సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఇప్పటి వరకు జూకంటి సంగారెడ్డి సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అతడు తన భార్య జూకంటి నాగలక్ష్మిని బరిలోకి దింపారు. వీరికి కాంగ్రెస్ పార్టీ మద్ధతునిస్తోంది. అలాగే బీఆర్‌ఎస్ నుంచి గతంలో సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన డోకూరి ఉదయ నర్సింహారెడ్డి, ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి రావడంతో మళ్లీ సర్పంచ్ బరిలో నిలిచారు.


