నామినేషన్ల జోరు
మూడో విడతలో నమోదైన నామినేషన్ల వివరాలు..
రెండో విడతలో..
మూడో
విడతలోనూ
కాటేపల్లి పంచాయతీ వద్ద నామినేషన్ వేసేందుకు క్యూలో ఉన్న అభ్యర్థులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం తుదిదశకు చేరుకుంది. మొదటి విడత ఎన్నికలు నిర్వహించే పంచాయతీలలో నామినేషన్ల ఘట్టం పూర్తయి అభ్యర్థుల లెక్క తేలడంతో ప్రచార పర్వం జోరందుకుంది. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాలలో బరిలో మిగిలిన అభ్యర్థుల లెక్క శనివారం తేలనుంది. మూడో విడతకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగిసింది. సాయంత్రం 5 వరకు వచ్చిన వారందరినీ నామినేషన్ల దాఖలు కేంద్రాల్లో కూర్చోబెట్టారు. రాత్రి వరకు నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది.
జిల్లాలో మూడో విడతలో బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని 168 సర్పంచ్ పదవులతోపాటు 1,482 వార్డులకు బుధ, గురు, శుక్రవారాల్లో నామినేషన్లు స్వీకరించారు. మూడో విడతకు సంబంధించి వచ్చిన నామినేషన్ల పరిశీలన శనివారం జరగనుంది. 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. ఆ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు.
తొలి విడత ఎన్నికలు నిర్వహించే గ్రామాలలో ప్ర చారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సోషల్ మీడియానూ ఉప యోగించుకుంటున్నారు. తొలి విడతలో ఈనెల 11న 10 మండలాల్లోని 167 గ్రామాల సర్పంచ్, 1,520 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
మండలం సర్పంచ్ స్థానం నామినేషన్లు వార్డులు నామినేషన్లు
బాన్సువాడ 25 159 222 477
బిచ్కుంద 23 141 204 436
బీర్కూర్ 13 94 114 294
డోంగ్లీ 13 91 116 253
జుక్కల్ 30 --- 270 ---
మద్నూర్ 21 163 194 444
నస్రుల్లాబాద్ 19 129 164 337
పెద్దకొడప్‌గల్ 24 122 198 335
మొత్తం 168 --- 1,482 ---
రెండో విడతలో ఏడు మండలాల్లోని 197 సర్పంచ్, 1,654 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారంతో ముగియనుంది. ఆ తర్వాత అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. దీంతో రెండో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాలలో ప్రచారం జోరందుకోనుంది.
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
మొదటి విడతలో హోరెత్తుతున్న ప్రచారం
రెండో విడత బరిలో మిగిలిన అభ్యర్థుల లెక్క తేలేది నేడే..


