‘బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి’
కామారెడ్డి టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించా లని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి విక్రమ్‌రెడ్డి కోరా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన పదాధికారుల సమావే శం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇ స్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగి న బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ తరఫున అ న్ని సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థులను నిలిపామని, మెజారిటీ స్థానాల్లో పార్టీ బల పరిచిన అభ్యర్థులు గెలుస్తారన్న ధీమా వ్య క్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకు లు మురళీధర్‌గౌడ్, రంజిత్ మోహన్, కడెం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ నేతలను కలిసిన
డీసీసీ మాజీ అధ్యక్షుడు
కామారెడ్డి టౌన్: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్‌లను డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. పంచాయతీ ఎన్నికలు, జిల్లాలో పార్టీ బలోపేతంపై వారు సూచనలిచ్చారని ఆయన ‘సాక్షి’తో తెలిపారు.
ఎల్లారెడ్డికి చేరుకున్న
ఎన్నికల సామగ్రి
ఎల్లారెడ్డి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామగ్రి శుక్రవారం జి ల్లా కేంద్రం నుంచి ఎల్లారెడ్డికి చేరుకుంది. ప ట్టణ శివారులోని మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో సా మగ్రిని భద్రపరిచారు. ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన పత్రాలు, బ్యాలెట్ బాక్స్ లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని వా టిని వార్డుల వారీగా వేరు చేస్తున్నామని మండల పరిషత్ అధికారి ప్రకాశ్ తెలిపారు.
ఉమ్మడి జిల్లా జట్టుకు నలుగురు క్రికెటర్ల ఎంపిక
కామారెడ్డి టౌన్ : హైదరాబాద్ క్రికెట్ ఆసో సియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం అండర్–14 ఉమ్మడి ని జామాబాద్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు ని ర్వహించారు. జిల్లాకు చెందిన నలుగురు క్రీ డాకారులు ప్రతిభ చూపి ఉమ్మడి జిల్లా జట్టు కు ఎంపికయ్యారని కోచ్ రియాజుద్దీన్ తెలి పారు. జిల్లాకు చెందిన కార్తికేయ, మణికంఠ, సాయి అక్షిత్, మహమ్మద్ అర్హన్ రాష్ట్రస్థా యి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి కుస్తీ
పోటీలలో ప్రతిభ
ఎల్లారెడ్డి: ఈనెల 1 నుంచి 3 వరకు జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) 69వ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి మాచబోయిన జశ్వంత్ అద్భుత ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన ఈ పోటీలలో జశ్వంత్ 75 కిలోల విభాగంలో తృతీయ స్థానం సాధించాడని పేర్కొన్నా రు. అతడిని అభినందించారు.
‘బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి’
‘బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి’
‘బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి’
‘బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి’


