నిధులు లేకుండా.. నిర్వహణ ఎలా?
● ఎన్నికల నిర్వహణకు నిధుల కొరత
● పంచాయతీ కార్యదర్శులపై
అదనపు భారం
ఎల్లారెడ్డి : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహ ణ క్షేత్రస్థాయి అధికారులకు భారంగా మారింది. నిర్వహణకయ్యే ఖర్చులకోసం నిధులు వి డుదల కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
పంచాయతీ ఎన్నికలను మూడు విడతల లో నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కో సం అధికారగణం సమాయత్తమయ్యింది. అ యితే ఎన్నికల నిర్వహణ అంటే మామూలు వి షయం కాదు. ప్రతీది ఖర్చుతో కూడుకున్నదే. ఎన్నికల నిర్వహణ విజయవంతంగా పూర్తి చే యాలంటే సరిపడా డబ్బులుండాలి. గ్రామ పంచాయతీల సంఖ్య ఆధారంగా ఒక్కో మండలానికి ఎన్నికల నిర్వహణ కోసం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అవసరం అవుతా యి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సా ధారణంగా మండల పరిషత్ జనరల్ ఫండ్ నుంచి నిధులు సమకూర్చుతారు. అయితే అధి క శాతం మండల పరిషత్‌లలో జనరల్ ఫండ్ లేకపోవడంతో ఎన్నికల ఏర్పాట్లకు డబ్బుల క టకట ఏర్పడింది. నామినేషన్ కేంద్రాల నిర్వహణ, ఎన్నికల సామగ్రి తరలించేందుకు వాహనాల అద్దెలు, ఎన్నికల కోడ్ అమలుకు, కేంద్రా ల నిర్వహణ, సిబ్బందికి భోజనాలు తదితర అ వసరాల కోసం అధికారులు ఇబ్బందిపడుతున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో టెంట్లు, భోజనాల ఏర్పాట్లకు వేలాది రూపాయలు ఖర్చుపెట్టామని పంచాయతీ కార్యదర్శులు పే ర్కొంటున్నారు. ఇప్పటికే రెండేళ్ల నుంచి గ్రామ పంచాయతీలలో పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు రావడం లేదు. చాలా మంది కార్యదర్శులు అప్పులు చేసి పంచాయతీలను నడిపిస్తున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడిన ట్లుగా ఎన్నికల నిర్వహణ అదనపు భారంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఉన్నతాధికారులు స్పందించి ఎన్నికల ని ర్వహణకు అవసరమైన నిధులను విడుదల చే యాలని కోరుతున్నారు.


