తండాల మధ్య ‘పంచాయతీ’ పోరు! | - | Sakshi
Sakshi News home page

తండాల మధ్య ‘పంచాయతీ’ పోరు!

Dec 6 2025 8:43 AM | Updated on Dec 6 2025 8:43 AM

తండాల

తండాల మధ్య ‘పంచాయతీ’ పోరు!

వేలం వేసుకున్నరు

బరిలో ఉన్నాం..

రామారెడ్డి : పంచాయతీ ఎన్నికలు రెండు తండాల మధ్య పంచాయితీ తెచ్చాయి. ఓటర్లు ఎక్కువున్న తండావాసులు తమకు అవకాశం దక్కకుండా చూస్తున్నారని ఆరోపిస్తూ మరో తండావాసులు ఎన్నికల బహిష్కరణకు సిద్ధమయ్యారు. వివరాలిలా ఉన్నాయి.

గోకుల్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలో మీది తండా, కింది తండాలున్నాయి. మీది తండా లో 350 ఓట్లు, ఐదు వార్డులు ఉండగా.. కింది తండాలో 250 మంది ఓట్లు, మూడు వార్డులు ఉన్నా యి. 2019లో ఈ గ్రామపంచాయతీకి మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మీది తండావాసులు తమ గ్రామానికి చెందిన వ్యక్తిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనాభా ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా ఆ తండావారే సర్పంచ్‌ను వేలం పాట ద్వారా ఎన్నుకోవాలని చూస్తున్నారని కింది తండావాసులు ఆరోపిస్తున్నారు. తమ తండా లో ఓటర్లు తక్కువగా ఉండడంతో పట్టించుకోవడం లేదని, వేలంలో కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా కింది తండానుంచి వార్డు స్థానాలకు నామినేషన్‌ వేసిన ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేసిన ఇద్దరు మాత్రం బరిలోనే ఉన్నారు.

తండాను సందర్శించిన ఆర్‌డీవో

కామారెడ్డి ఆర్‌డీవో వీణ రామారెడ్డి తహసీల్దార్‌ ఉ మాలతతో కలిసి శుక్రవారం కింది తండాను సంద ర్శించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే మీది తండాలోని పోలింగ్‌ కేంద్రంలో ఓట్లు వేయబోమని, కింద తండాలోనే పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తండావాసులు డిమాండ్‌ చేశారు. పోసానిపేటలో పోలింగ్‌ కేంద్రం పెట్టినా ఓట్లు వేస్తామన్నారు. లేకపోతే ఓట్లు వేయబోమన్నారు. మీది తండాలో సర్పంచ్‌ పదవి వేలానికి సంబంధించిన ఫోన్‌ రికార్డులున్నాయన్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో పేర్కొన్నారు.

కింది తండావాసులతో సమావేశమైన ఆర్‌డీవో వీణ

మీది తండాలో ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. మా తండాకు సంబంధం లేకుండానే సర్పంచ్‌ పదవిని వేలం వేసుకుని ఒక అభ్యర్థిని నిలబెట్టారు.

– తిరుపతినాయక్‌, సర్పంచ్‌ అభ్యర్థి, కింది తండా

సర్పంచ్‌ అభ్యర్థులుగా మీది తండా నుంచి ఒకరు, మా తండా నుంచి ఇద్దరం పోటీ లో ఉన్నాం. మీది తండా అభ్యర్థి తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని చెప్పుకుంటున్నాడు. వాళ్లు మమ్మల్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. – పంతులు, సర్పంచ్‌ అభ్యర్థి, కింది తండా

తండాల మధ్య ‘పంచాయతీ’ పోరు!1
1/2

తండాల మధ్య ‘పంచాయతీ’ పోరు!

తండాల మధ్య ‘పంచాయతీ’ పోరు!2
2/2

తండాల మధ్య ‘పంచాయతీ’ పోరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement