పంచాయతీ ఎన్నికల్లో నిశబ్ద ప్రచారం | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికల్లో నిశబ్ద ప్రచారం

Dec 5 2025 6:07 AM | Updated on Dec 5 2025 6:07 AM

పంచాయ

పంచాయతీ ఎన్నికల్లో నిశబ్ద ప్రచారం

పరిమితికి మించి ఖర్చు చేయొద్దు

బాధ్యతల స్వీకరణకు ఓ టైం ఉంది..

పవర్‌ ఉన్న ఉప సర్పంచ్‌

దోమకొండ: పల్లెల్లో ప్రస్తుతం సర్పంచ్‌, వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌గా ఎన్నికై తే గ్రామానికి పాలకుడిగా అధికారం చెలాయించవచ్చని చాలా మంది సర్పంచ్‌ పదవికి పోటీ పడుతున్నారు. కానీ సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌ పదవి కూడా ఎంతో ప్రాధాన్యమైంది. 2018 పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల్లో ఉప సర్పంచ్‌కు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇవ్వడంతో ఆ పదవి కీలకంగా మారింది. గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో అక్రమాలకు తావివ్వకుండా అడ్డుకునే అవకాశం ఉంది. సమష్టి నిర్ణయం తీసుకోకుండా సర్పంచ్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉప సర్పంచ్‌ తన చెక్‌ పవర్‌తో అడ్డుకట్ట వేయవచ్చు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్‌ అనుకూలించక సర్పంచి పదవికి పోటీ చేయలేకపోయిన అభ్యర్థులు ఉప సర్పంచ్‌ పదవి కోసం వార్డు సభ్యులుగా పోటీ చేస్తుంటారు.

రెంజల్‌(బోధన్‌)/మాక్లూర్‌: పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు తిరగకుండా, మైక్‌లతో హోరెత్తించకుండా నిశబ్ధంగా ప్రచారం చేస్తున్నారు. అదెలా అంటే.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ ఫోన్లు ఉండటంతో ఆ ఫోన్లకే సోషల్‌ మీడియా ద్వారా అభ్యర్థులు నేరుగా తమను గెలిపించాలంటూ ప్రచారం చేసే చిత్రాలు, వీడియోలు పంపిస్తూ రూపాయి ఖర్చు లేకుండా నిశబ్దంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో గోడలపై రాతలు, వాల్‌ పోస్టర్లులు, కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ తిరుగుతు అందించే వారు. ఎన్నికల నిబంధనలతో నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వార ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్దతుదారులు, కుటుంబీకులతో కలిసి చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతీ ఒక్కరి వాట్సాప్‌ స్టేటస్‌లో అభ్యర్థుల ప్రచారాలే సాక్షాత్కరిస్తున్నాయి. సోషల్‌ మీడియా వారియర్స్‌ను ఏర్పాటు చేసుకుని తంతును సాగిస్తున్నారు. తమను గెలిపిస్తే నాయకుడిగా కాదని..సేవకునిగా పని చేస్తామని నమ్మిస్తున్నారు. గ్రామాల్లోని సమస్యలను ఎత్తి చూపుతూ వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ప్రచారం చేస్తున్నారు. మరికొందరూ ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి తమ సొంత మేనిఫెస్టోలను రుద్దుతున్నారు. సోషల్‌ మీడియాలో పెద్దగా ఖర్చు లేకపోవడంతో ప్రధాన ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటున్నారు.

వాట్సాప్‌లో గ్రూపులు..

కొందరు యువకులు వాట్సాప్‌లో గ్రామానికి వర్తించే పేర్లను క్రియోట్‌ చేసుకొని ఆదర్శగ్రామం, ఆదర్శ రైతు, ఐకాన్‌, లేజెండ్‌ వంటి గ్రూపులను ఏర్పాటు చేసుకొని తెల్లవారిందే తడువుగా పోస్టులు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు మహిళ సర్పంచ్‌ అభ్యర్థులు రాణి రుద్రమదేవి, ఇందిరమ్మ, అరుందతి, మంగమ్మ, సరస్వతి వంటి పేర్లతో కొత్తగా వాట్సప్‌ గ్రూపులను క్రియోట్‌ చేసుకుని ప్రచారానికి దిగారు. ఇంకొందరు నేరుగా యూట్యూబ్‌ చానళ్లను పెట్టుకుని గంట గంటకు తన గురించి గొప్పగా చెప్పుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంత మంది లైక్‌లు కొట్టారు. ఇంత మంది చూశారు అంటూ లోలోపల మురిసిపోతున్నారు.

మోర్తాడ్‌(బాల్కొండ): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం ప్రచారం ఖర్చుల లెక్కలు పక్కాగా చూపాల్సి ఉంది. నామినేషన్‌ దాఖలు చేసిన నుంచి పోలింగ్‌ ముగిసే వరకూ రోజువారి లెక్కలను ఒక లెడ్జర్‌లో రాసి ఎన్నికల సంఘానికి అప్పగించాలి. 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డు అభ్యర్థి రూ.50వేల వరకూ ఖర్చు చేయవచ్చు. 5వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామంలో సర్పంచ్‌ పదవికి పోటీ చేసేవారు రూ.1.50లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.30వేల వరకూ ఖర్చు చేయాలి. పరిమితికి మించి ఖర్చు చేస్తే మాత్రం ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ముందే అభ్యర్థులు బ్యాంకు ఖాతాలు తీసుకున్నారు. ఆ ఖాతా ద్వారానే తమ ప్రచారం ఖర్చుకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు చేయాలి. రోజువారి ప్రచారం ఖర్చుకు సంబంధించి ఎన్నికల సంఘం చేసిన సూచనలను పాటించి ఆ ప్రకారమే బిల్లులు చెల్లించాల్సి ఉంది. బిల్లుల చెల్లింపులో వ్యత్యాసం ఉన్నా స్టాటికల్‌ టీంకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

ఎల్లారెడ్డి: మూడు విడతలలో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో పోలింగ్‌ పూర్తయి విజయం సాధించిన పంచాయతీల విజేతలు మూడు విడతల ఎన్నికలు పూర్తయ్యే వరకు బాధ్యతలు స్వీకరించలేరు. వారు సర్పంచులుగా గెలిచినట్లు రిటర్నింగ్‌ అధికారులు ధ్రువపత్రాలు అందజేసినప్పటికీ అప్పుడే అధికారం చేతికి రాదు.

మూడు విడతల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన రోజునే గ్రామ పంచాయతీల పాలక వర్గాలు కొలువు దీరుతాయి.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొనకూడదు

రెంజల్‌(బోధన్‌): గ్రామ పంచాయతీల ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది సైతం సాధారణ పౌరుల్లాగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్నికల కమిషన్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వ ఉద్యోగులు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు. కానీ ఏ పార్టీకి, అభ్యర్థికి అనుకూలంగా ప్రచారంలో పాల్గొనకూడదు. తమ బంధువులు ఎన్నికల్లో పోటీ చేసినా ప్రభుత్వ ఉద్యోగులు దూరంగా ఉండాల్సిందే. ఉద్యోగులెవరైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎవరైన ఆధారాలతో నిరూపిస్తే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఉపాధిహామీ, ఐకేపీ, ఆశలు, అంగన్‌వాడీలు, విద్య, ౖ వెద్య సిబ్బంది, సీసీలు, పీఆర్‌పీలు, రిసోర్స్‌ పర్సన్‌లు, ఏపీవోలు, ఏపీఎంలతో పాటు కాంట్రాక్టు పద్దతిలో పని చేసే ప్రతీ ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఉల్లంగిస్తే వేటు పడుతుంది. సభలు, సమావేశాలు, విందుల్లో పాల్గొన్నట్లు రుజువైతే శిక్ష అనుభవించాల్సిందే.

పల్లెల్లో తిరగకుండా,

మైక్‌లతో హోరెత్తించకుండా..

సోషల్‌ మీడియాను నమ్ముకున్న పలువురు అభ్యర్థులు

తమను గెలిపించాలంటూ పోస్టులు, వీడియోలు, వాట్సాప్‌లో స్టేటస్‌లు పెడుతున్న వైనం

పంచాయతీ ఎన్నికల్లో నిశబ్ద ప్రచారం 1
1/2

పంచాయతీ ఎన్నికల్లో నిశబ్ద ప్రచారం

పంచాయతీ ఎన్నికల్లో నిశబ్ద ప్రచారం 2
2/2

పంచాయతీ ఎన్నికల్లో నిశబ్ద ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement