పారిశ్రామికవేత్తలుగా రాణించాలి | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామికవేత్తలుగా రాణించాలి

Dec 5 2025 6:07 AM | Updated on Dec 5 2025 6:07 AM

పారిశ

పారిశ్రామికవేత్తలుగా రాణించాలి

పారిశ్రామికవేత్తలుగా రాణించాలి బాండ్లతో వినూత్న ప్రచారం ఆడపిల్ల పుడితే రూ. 3,116 మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి

భిక్కనూరు: మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని వి హబ్‌ డైరెక్టర్‌ అక్తర్‌ షేక్‌ అన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌లో సోషల్‌వర్కు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోందన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, సోషల్‌వర్కు విభాగం అధిపతి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మాచారెడ్డి: గజ్యానాయక్‌తండా జీపీ చౌరస్తాలో పలు సమస్యలతో పాటు డ్రైనేజీ నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తానని సర్పంచ్‌ అభ్యర్థి శివాణి గురువారం బాండ్‌ రాసి గ్రామస్తులకు పంపిణీ చేస్తూ తన ప్రచారాన్ని నిర్వహించారు. ఏడాది లోపల తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని, హామీని నిలబెట్టుకోకుంటే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.

సర్పంచ్‌ అభ్యర్థి హామీ

బీబీపేట(కామారెడ్డి): ఎన్నికలలో గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూ అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించడం సహజం. ఇలాగే ఓ సర్పంచ్‌ అభ్యర్థి గెలిపిస్తే ఏం చేస్తానో అన్న వివరాలతో మేనిఫెస్టో రూపొందించాడు. గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ. 3,116 కానుకగా ఇస్తానని ప్రకటించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్‌లో 2,553 మంది ఓటర్లున్నారు. గ్రామ జనాభా మూడువేల పైచిలుకు ఉంటుంది. ఇక్కడ సర్పంచ్‌ అభ్యర్థి పోటీ చేస్తున్న నాగరాజు గౌడ్‌.. తనకు సర్పంచ్‌గా అవకాశం ఇస్తే ఏం చేస్తానన్న వివరాలతో సొంత మేనిఫెస్టో ప్రకటించారు. ప్రధానంగా ఆడపిల్ల పుడితే రూ. 3,116 కానుకగా ఇస్తానని చెప్పడంపై గ్రామంలో చర్చ నడుస్తోంది.

తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థినులు, మహిళలు మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ యాదగిరి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌ సోషల్‌ వర్క్‌ విభాగం, వి–హబ్‌ (ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌) ఫౌండేషన్‌ (తెలంగాణ ప్రభుత్వం) సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో వర్సిటీ మెయిన్‌ క్యాంపస్‌ (డిచ్‌పల్లి)లో విద్యార్థినులకు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు కార్యక్రమ బ్రోచర్లను గురువారం వారు తెయూలో ఆవిష్కరించారు. త్వరలోనే తెలంగాణ యూనివర్సిటీ, వి–హబ్‌ ఫౌండేషన్‌ల మధ్య ఎంవోయూ (అవగాహన ఒప్పందం) కుదుర్చుకుంటామన్నారు. తెయూ సోషల్‌వర్క్‌ విభాగాధిపతి అంజయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, ఫౌండేషన్‌ డైరెక్టర్‌ జహీద్‌ అక్బర్‌ షేక్‌, ఫౌండేషన్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఊహ, టీమ్‌ మెంబర్స్‌ తాజ్దార్‌ అలీ, మేఘన, సౌమ్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

బోధన్‌రూరల్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌ గురువారం మండలంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బోధన్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని పరిశీలించిన అబ్జర్వర్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కోసం చేపట్టిన ఏర్పాట్లు, పోలింగ్‌ మెటీరియల్‌ను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. నోడల్‌ అధికారులు, స్థానిక అధికారులు ఉన్నారు.

పారిశ్రామికవేత్తలుగా  రాణించాలి 1
1/2

పారిశ్రామికవేత్తలుగా రాణించాలి

పారిశ్రామికవేత్తలుగా  రాణించాలి 2
2/2

పారిశ్రామికవేత్తలుగా రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement