ఇందల్వాయి చెక్‌పోస్టు తనిఖీ
ఇందల్వాయి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇందల్వాయి టోల్‌ప్లాజా చెక్‌పోస్ట్‌ను సీపీ సా యిచైతన్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ.. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, నగదు, మ ద్యం, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసు కుంటున్నామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. సీపీ వెంట ఎస్‌ఎస్ టీమ్ ఇన్‌చార్జి సాయి కుమార్, రవీందర్, సిబ్బంది ఉన్నారు.


