సర్పంచ్ నుంచి సీడీసీ చైర్మన్ వరకు..
● మళ్లీ సర్పంచ్ బరిలో...
దోమకొండ: మండల కేంద్రాని కి చెందిన ఐరేని నర్సయ్య 2006 నుంచి 2011 వరకు గ్రా మ సర్పంచ్‌గా పనిచేశారు. అంతకుముందు 1991 నుంచి 95 వరకు సింగిల్ విండో డైరెక్టర్‌గా గెలిచారు. అ నంతరం 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్ల పా టు సింగిల్ విండో చైర్మన్‌గా పని చేశారు. 2022లో సీడీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీడీసీ చైర్మన్‌గా ఎన్నికై న ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పదవిని కోల్పోయారు. తిరి గి ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 30 ఏళ్లుగా ప్రజాప్రతినిఽధిగా కొనసాగుతున్న ఆయన ఈసారి సర్పంచ్‌గా తనను మళ్లీ గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
బీబీపేట: స్థానిక ఎన్నికల సందర్భంగా పల్లెలు వేడెక్కాయి. ప్రతీ ఒక్క వార్డులో సుమారు పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు. గత ప్రభుత్వ హయాంలో చెక్‌పవర్‌ను సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్‌కు కల్పించడంతో ప్రతి ఒక్కరి దృష్టి ఉపసర్పంచ్ పదవిపైనే పడింది. దీంతో సర్పంచ్ స్థానానికి ఎంతైతే పోటీ ఉందో వార్డు సభ్యుడికి కూడా అదే పోటీ నెలకొంది. కొన్ని గ్రామాల్లో వార్డు సభ్యుల విత్‌డ్రాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ స్థానాన్ని కై వసం చేసుకోవాలని వేచి చూస్తున్నారు. దాని కోసం వార్డుల్లోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వార్డు సభ్యులు సైతం రూ.లక్షల్లో ఖర్చు చేస్తూ మచ్చిక చేసుకుంటున్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షల్లో గురువారం 251 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 30 పరీక్ష కేంద్రాలలో 5,186 మంది విద్యార్థులకు గాను 4,935 మంది అభ్యర్థులు హాజరు కాగా 251 మంది గైర్హాజర్ అయినట్లు ఆయన తెలిపారు. ఉదయం జరిగిన 5వ సెమిస్టర్ రెగ్యులర్, 6వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలకు 4,887 మందికి గాను 4,664 మంది హాజరు కాగా 223 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్నం 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 299 మందికి గాను 271 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను చంద్రశేఖర్ తనిఖీ చేశారు.


