నేడు పత్తి కొనుగోళ్లు బంద్
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో పత్తి కొనుగోళ్లను గురువారం బంద్ చేస్తున్నట్లు జి న్నింగ్ మిల్లుల యజమానులు బుధవారం తె లిపారు. తెలంగాణ కాటన్ మిల్లులు, ట్రేడర్ల వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు పత్తి కొ నుగోళ్లు నిలిపివేయనున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. సీసీఐ విధించిన కఠిన నిబంధనల ను ఎత్తివేయాలని కోరారు. రైతులు పత్తిని తీ సుకురావొద్దని వారు సూచించారు. పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వి ధించిన ఆంక్షలు తమను చిత్తు చేస్తున్నాయని, ఒకవైపు అధిక వర్షాలతో పత్తి దిగుబడి తగ్గిందని ఆవేదన చెందుతుండగా.. సీసీఐ, వ్యాపారుల ఆంక్షలు మరింత క్షోభకు గురిచేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పిట్లం(జుక్కల్): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి గణేశ్ ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సంజీవులు తెలిపారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండర్–17 కబడ్డీ సెలక్షన్స్‌లో పదోతరగతి విద్యార్థి గణేశ్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎంపికయ్యాడన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. గణేశ్‌ను హెచ్‌ఎం దేవీసింగ్, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు అభినందించారు.
బాన్సువాడ : ఈ నెల 10వ తేదీన బాన్సువాడ మినీ స్టేడియంలో ఉమ్మడి జిల్లా సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ టోర్నీని నిర్వహించనున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్ తెలిపారు. టోర్నీలో పాల్గొనాలనుకునే వారు పీఈటీ సురేందర్‌ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఫిజికల్ డైరెక్టర్ సురేందర్ వ్యవహారిస్తారని, పూర్తి వివరాలకు 99093 70837 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
కామారెడ్డి అర్బన్: రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టడీ ప్రా జెక్ట్‌లో కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అర్థశాస్త్ర విభాగం ప్రథమ బహుమతి సాధించింది. గ్రామీణ ప్రాంత అర్థశాస్త్ర విద్యార్థుల ప్రతిభ, పట్టుదలకు ఈ విజయం నిదర్శనమ ని ప్రిన్సిపల్ కే విజయ్‌కుమార్ ప్రశంసించా రు. హైదరాబాద్‌లో నిర్వహించిన జిజ్ఞాసలో ఎకానమిక్స్ లెక్చరర్ రాజ్‌గంభీరావు మార్గదర్శనంలో కే.అర్చన, ఎన్.కావేరి, జే.వందన, ముస్కాన్, ఎం.భవిత, సృజనలు ‘తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం మహాలక్ష్మి పథకం–కామారెడ్డి జిల్లాలో ప్రభావం’ అంశంపై అర్థశాస్త్ర విద్యార్థులు ఇచ్చిన స్టడీ ప్రాజెక్ట్ ప్రదర్శన అత్యుత్తమంగా నిలిచి ప్రథమ బహుమతి అందుకుంది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల విద్య ఉన్నతాధికారులు యోగితారాణా, దేవసేన చేతుల మీదుగా రూ.30 వేల నగదు పురస్కారంతోపాటు ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేశారు. అర్థశాస్త్ర విభాగం అధ్యాపకులు రాజ్‌గంభీర్‌రావు, సుధాకర్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పత్తి కొనుగోళ్లు బంద్
నేడు పత్తి కొనుగోళ్లు బంద్


