మత్స్యకారులు దళారులను ఆశ్రయించొద్దు
బాన్సువాడ : దోపిడీ వ్యవస్థను రూపుమాపాలనే సంకల్పంతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మత్స్యకారులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా మార్కెట్‌లో చేపలను విక్రయించి ఆర్థికంగా లబ్ధిపొందాలని సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, ట్రెయినీ కలెక్టర్ రవితేజతో కలిసి బాన్సువాడలోని కల్కి చెరువులో పోచారం బుధవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.కోట్లాది నిధులు ఖర్చు చేసి వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. చిన్న చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేస్తే ఎక్కువ శాతం చనిపోతాయని, దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారన్నారు. చేప పిల్లలు 80 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీ మీటర్ల వరకు ఉండాలని అన్నారు. బాన్సువాడ కల్కి చెరువులో లక్షా 71 వేల చేప పిల్లలను వేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫిషరిస్ అధికారి శ్రీపతి, జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గాదం సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు సాయిబాబా, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గిర్మి కృష్ణ, నాయకులు కృష్ణారెడ్డి, ఎజాస్, నార్ల సురేశ్, నార్ల రవీందర్, మధుసూదన్‌రెడ్డి, పసుపుల సాయిలు, నామాల శంకర్, వాహబ్, తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
బాన్సువాడ పట్టణానికి చెందిన వారితోపాటు బీర్కూర్, బాన్సువాడ రూరల్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన రూ.4 కోట్ల పెండింగ్ బిల్లులను లబ్ధిదారులకు అందజేశారు.
దోపిడీ వ్యవస్థను రూపుమాపేందుకే
చేప పిల్లల పంపిణీ
ప్రభుత్వ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ కల్కి చెరువులో
చేప పిల్లల విడుదల


