క్రైం కార్నర్
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
భిక్కనూరు: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎ స్సై ఆంజనేయులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండ్రెడ్డి నర్సింలు(40) కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఎలాంటి పని చేయకుండా తిరిగేవాడు. మంగళవారం రాత్రి మద్యానికి డబ్బులు కావాలని ఇంట్లో అడుగగా వారు నిరాకరించారు. దీంతో జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని తిలక్‌గార్డెన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిలక్‌గార్డెన్ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
క్రైం కార్నర్


