చింపాంజీ వేషం.. కోతులు పరార్
అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన వానరాలు గ్రామీణ ప్రాంతాల్లో జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇళ్లలోకి వెళ్లి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడమే కాకుండా ప్రజలపై దాడులు చేస్తున్నాయి. కోతుల బెడదను తప్పించేందుకు పెద్దకొడప్‌గల్ మండలం కాటేపల్లి గ్రామస్తులు వినూత్న ప్రయత్నం చేశారు. ఆదివారం ఓ వ్యక్తికి చింపాంజీ డ్రెస్ వేయించి కోతులు ఉన్న ప్రాంతాల్లో తిప్పారు. దీంతో కోతులు భయపడి పరారవ్వడంతో గ్రామస్తులకు ఉపశమనం లభించింది. కాగా, చింపాంజీ వేషధారణ చేసిన వ్యక్తితో యువకులు కొందరు సెల్ఫీలు తీసుకున్నారు.
– పెద్దకొడప్‌గల్(జుక్కల్)


