ఏఐ క్లాసులతో సత్ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ఏఐ క్లాసులతో సత్ఫలితాలు

Oct 27 2025 8:28 AM | Updated on Oct 27 2025 8:28 AM

ఏఐ క్

ఏఐ క్లాసులతో సత్ఫలితాలు

20 నిమిషాలపాటు..

ఈ స్కూళ్లలోనే ఏఐ తరగతులు..

విద్యార్థులకు మేలు చేస్తోంది..

పెరుగుతున్న సామర్థ్యం

ప్రైమరీ స్కూళ్లలో పెరిగిన హాజరు

విద్యార్థుల్లో పెరుగుతున్న

కంప్యూటర్‌ పరిజ్ఞానం

ఇబ్బంది పెడుతున్న ఇంటర్‌నెట్‌

రామారెడ్డి : ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) క్లాసులు సత్ఫలితాలనిస్తున్నాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచడంతోపాటు పాఠాలు సులభంగా అర్థమవుతున్నాయి. దీంతో ఏఐ క్లాసులు ఉన్న స్కూళ్లలో విద్యార్థుల హాజరుశాతం మెరుగుపడింది.

చదువులో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలు సులభంగా నేర్చుకునేందుకు ప్రైమరీ స్కూళ్లలో ప్రభుత్వం ఏఐ క్లాసులను నిర్వహిస్తోంది. కామారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 27 ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేశారు. కంప్యూటర్‌ ద్వారానే మ్యాథ్స్‌, సైన్స్‌, తెలుగు తదితర సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు చెబుతున్నారు. ఆకట్టుకునే బొమ్మలతో పాఠాలు చెప్పటంతో విద్యార్థులు సులభంగా నేర్చుకుంటున్నారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుపై 20 నిమిషాలు క్లాస్‌ నిర్వహిస్తున్నారు. అయితే, ఏఐ క్లాసుల నిర్వహణతో డ్రాపౌట్స్‌ తగ్గాయి. దీంతో అధికారులు ఇటీవల ‘నో మోర్‌ డ్రాపౌట్స్‌’ పేరిట డాక్యుమెంటరీ తీశారు. ఇదిలా ఉండగా ఏఐ క్లాసుల నిర్వహణకు ఇంటర్‌నెట్‌ సమస్యగా తలనొప్పిగా మారింది. మొబైల్‌ ఫోన్ల ద్వారా కనెక్షన్‌ ఇస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మండలం ప్రాథమిక పాఠశాలలు

రామారెడ్డి రెడ్డిపేట తండా, రామారెడ్డి, మద్దికుంట

లింగంపేట శెట్పల్లి, మోతె తండా, పోతాయిపల్లి

బాన్సువాడ తాడ్కోల్‌, హన్మాజీపేట, బొల్లారం

బీబీపేట శివారు రాంరెడ్డిపల్లి

జుక్కల్‌ హంగర్గ

బిచ్కుంద హస్గుల్‌, గుండెనెమ్లి, జామ మసీద్‌

నస్రుల్లాబాద్‌ నస్రుల్లాబాద్‌

ఏఐ బోధన విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. ఇ బ్బంది పడకుండా అన్ని వి షయాలను నేర్చుకుంటు న్నారు. రెగ్యులర్‌ తరగతిలో అందరినీ దృష్టిలో పెట్టుకొ ని టీచర్లు పాఠాలు చెబుతారు. ఏఐలో విద్యార్థి సా మర్థ్యం పసిగట్టి దాని ఆధారంగానే పాఠాల బోధన ఉంటుంది. – ఆనంద్‌రావు, ఎంఈవో, రామారెడ్డి

ఏఐ క్లాసుల నిర్వహణతో కంప్యూటర్‌ పరిజ్ఞానం పెరు గుతుంది. పాఠాలను సుల భంగా అర్థం చేసుకుంటు న్నారు. దీంతో విద్యార్థుల్లో చదివే సామర్థ్యం పెరుగుతోంది. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతున్నారు.

– రాజు, ఉపాధ్యాయుడు, రామారెడ్డి

ఏఐ క్లాసులతో సత్ఫలితాలు1
1/2

ఏఐ క్లాసులతో సత్ఫలితాలు

ఏఐ క్లాసులతో సత్ఫలితాలు2
2/2

ఏఐ క్లాసులతో సత్ఫలితాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement