నేడు వైన్ షాపులకు లక్కీ డ్రా
● కలెక్టర్ ఆధ్వర్యంలో
దుకాణాల కేటాయింపు
● వ్యాపారుల ముందస్తు ఒప్పందాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా సోమవారం నిర్వహించనున్నారు. 2025–27 సంవత్సరాలకు జిల్లాలోని 49 దుకాణాలకు 1,502 దరఖాస్తులు రాగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో డ్రా తీసేందుకు ఎకై ్సజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటల నుంచి దుకాణాల కేటాయింపు కోసం డ్రా తీయనున్నారు. ఒక్కో దుకాణానికి దరఖాస్తు చేసుకున్న వారి సమక్షంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేసి వారికి ఆయా దుకాణాలను కేటాయిస్తారు. జిల్లాలో మద్యం దందాలో సక్సెస్‌లో ఉన్నవారు కొందరు సిండికేట్‌గా మారి వీలైనన్ని ఎక్కువ దుకాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ వారి పేరిట దుకాణాలు దక్కకుంటే, వచ్చిన వారికి గుడ్‌విల్ ఇచ్చి తీసుకునేందుకు ముందుగానే ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగే కొన్ని దుకాణాలకు ఎక్కువ పోటీ ఉంది. వాటిని ఎలాగైనా దక్కించుకోవాలని మద్యం వ్యాపారులు ముందస్తు ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది.


