
1,449 దరఖాస్తులు..
కామారెడ్డి రూరల్: జిల్లాలోని మద్యం దుకాణాలకు బుధవారం 5 దరఖాస్తులు అందినట్లు ఎక్సై జ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 1,449 దరఖాస్తులు అందాయన్నారు. కామారెడ్డి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 15 దుకాణాలకు గాను 450 దరఖాస్తులు, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 దుకాణాలకు 226, బాన్సువాడ స్టేషన్ పరిధిలో 9 దుకాణాలకు 245, దోమకొండ స్టేషన్ పరిధిలో 8 దుకాణాలకు 307, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 10 దుకాణాలకు 221 దరఖాస్తులు అందినట్లు వివరించారు. గురువారం సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆసక్తిగల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ కోరారు. 27వ తేదీన కామారెడ్డి పట్టణంలోని రేణుకాదేవి కల్యాణ మండపంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమక్షంలో దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా తీయనున్నట్లు తెలిపారు.