
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక
దోమకొండ: మండల కేంద్రంలోని గడీకోటలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలను నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తీగల తిర్మల్‌గౌడ్, ఎస్సై స్రవంతి, ఎంపీడీవో ప్రవీ ణ్‌కుమార్ తదితరులు ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు కోచ్ ప్రతాప్‌దాస్ తెలిపారు.
అండర్– 14 ఇండియన్ రౌండ్ బాలుర విభాగంలో భువన్, ప్రణీత్, అంకుల్, అండర్ –14 బాలికల విభాగంలో లాస్య, స్నేహ, రమ్య, అండర్– 17 బాలుర విభాగంలో శ్రీశాంత్, రేహాన్, రామ్‌చరణ్, బాలికల విభాగంలో ప్రీతి, శ్రీవర్చన, సహస్ర, అండర్–10 విభాగంలో వర్షిత, అండర్–19 బాలుర విభాగంలో రాజేందర్, దీక్షిత్, రిత్విక్, బాలికల విభాగంలో అమూల్య, సుమిత్ర, అశ్విని, రికరు అండర్–14 బాలుర విభాగంలో రుత్విక్, స్నేహిత్, బాలికల విభాగంలో వర్షిణి, నక్షత్ర, నైనిక, అండర్ 17 విభాగంలో ఇందు, సుమంత్, కాంపౌండ్ విభాగంలో కృష్ణసాయి తదితరులు ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, గడీకోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి, పీడీ నరసింహారెడ్డి, అర్చరీ అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరె మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.