
ఆర్టీఏ చెక్‌పోస్టుల ఎత్తివేత
మద్నూర్/భిక్కనూర్ : జిల్లాలోని సలాబత్‌పూర్, జంగంపల్లి వద్ద కొనసాగిన ఆర్టీఏ చెక్‌పోస్టులను ఎత్తివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 5గంటలకు చెక్‌పోస్టులను మూసివేసిన అధికారులు జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఇక నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోని సలాబత్‌పూర్‌తోపాటు భిక్కనూర్ మండలం జంగంపల్లి శివార్లలో రవాణాశాఖకు సంబంధించి చెక్‌పోస్టు కార్యకలాపాలు కొనసాగవు. చెక్‌పోస్టుల్లోని కంప్యూటర్లు, ప్రింటర్‌లు, రిజిస్టర్లతోపాటు ఇతర సామగ్రిని జిల్లా కేంద్రానికి తరలించారు.
ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్..
రాష్ట్రంలోని రవాణశాఖ చెక్‌పోస్ట్‌లను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చెక్‌పోస్ట్‌ల స్థానంలో ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్(ఏఎన్‌పీఆర్) విధానం తీసుకువస్తున్నారు. ఏఎన్‌పీఆర్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ సిస్టమ్ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. ఏ వాహనమైనా కెమెరా కన్నుకప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వస్తే వాటిని జాతీయ రహదారులపై అడ్డుకొని చర్యలు తీసుకునేందుకు వీలుగా మొబైల్ స్క్వాడ్‌లను కూడా రంగంలోకి దింపనున్నారు. ఈ వ్యవస్థపై ముందుగా గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ వాహన యాజమానుల అసోషియేషన్‌కు ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్‌తోపాటు సరుకు రవాణా వాహనాల పర్మిట్లు మిగిలిన అనుమతులన్ని ముందే ఆన్‌లైన్‌లో పొందేలా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
సలాబత్‌పూర్, జంగంపల్లి
శివార్లలో మూసివేత
కార్యాలయాలకు తాళాలు
జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో
రిపోర్ట్ చేసిన అధికారులు

ఆర్టీఏ చెక్‌పోస్టుల ఎత్తివేత

ఆర్టీఏ చెక్‌పోస్టుల ఎత్తివేత