
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నా రు. మండలంలోని నందివాడలో బుధవా రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ మా ర్కింగ్ చేశారు. నందివాడ గ్రామానికి 24 ఇళ్లు మంజూరు కాగా అందులో 13 మా త్రమే మార్కింగ్ చేశారన్నారు. స్లాబ్ లెవల్ లో ఒకటి ఉండగా, బేస్మెంట్ లెవల్‌లో నాలుగు ఉన్నాయని, మరో నాలుగు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. మూడు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని, వాటి నిర్మాణాలు ప్రారంభం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లు నిర్మించుకున్న వారికి సకాంలో బిల్లులు అందేలా చూస్తామన్నారు. పీడీ విజయసా యిరెడ్డి, డీఈ సుభాష్‌రెడ్డి, ఎంపీడీవో స య్యద్ సాజీద్ అలీ, తహసీల్దార్ శ్వేత, ఎంపీవో సవితారెడ్డి, ఏఈ శ్రీనివాస్, గ్రామపెద్ద లు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎన్‌కౌంటర్ విచారణ
అధికారిగా ఎల్లారెడ్డి డీఎస్పీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన రియాజ్ ఎన్‌కౌంటర్ పై పోలీసు శాఖ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమించింది. బుధవారం డీఎస్పీ శ్రీనివాసరావు నిజామాబాద్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చి విచారణ నిర్వహించారు. రియాజ్ ఎన్‌కౌంటర్ పై పౌరసంఘాలు స్పందించడం, మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పోలీసు శాఖ పక్క జిల్లా డీఎస్పీ ద్వారా విచారణ చేయిస్తోంది.
బాన్సువాడ: పట్టణంలోని మార్కెట్ కమిటీ యార్డులో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ బుధవారం పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రంలోని సమస్యలను తెలుసుకున్నారు. తేమశాతాన్ని పరీక్షించే యంత్రాలతోపాటు ప్యాడి క్లీనర్‌లను సరఫరా చేస్తామన్నారు. పెద్ద డ్రైయర్ల సరఫరా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఎండీ పేర్కొన్నారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఆర్డీవో సురేందర్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ అధికారి రామ్మోహన్, సివిల్ సప్లయీస్ జిల్లా అఽ దికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్ , పీఎసీఎస్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్ , రైతులు, సొసైటీల సెక్రెటరీలు, రైతులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: ఈనెల 27వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌రెడ్డి, విజయరామరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ధర్నా నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
జర్మనీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(టాంకాం) ద్వారా జర్మనీ దేశంలో ఆరోగ్య సంరక్షణ ఉ ద్యోగాల కోసం 18 నుంచి 28 ఏళ్లలోపు వారి నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు కో రుతున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్మనీలో 3 ఏళ్ల నర్సింగ్ ఇంటర్నేషనల్ డిగ్రీని పొందడంతో పాటు నెలకు రూ.లక్ష స్కాలర్‌షిప్ అందిస్తారని, కోర్సు అనంతరం నెలకు రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశం ఉంటుందన్నారు. ఇంటర్‌లో కనీసం 60 శా తం మార్కులతో పాసైన వారికి హైదరాబా ద్‌లో 9 నెలల పాటు జర్మనీ భాషలో రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 63022 92450, 94400 51763 నంబర్‌లకు సంప్రదించవచ్చన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి