
కుటుంబ సభ్యులు తిడుతున్నారని సెల్ టవర్ ఎక్కిన వృద్ధుడ
భిక్కనూరు: వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించానని కుటుంబ సభ్యులు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇక తనకు చావే శరణ్యమని జంగంపల్లికి చెందిన వృద్ధుడు కర్రోల్ల చిన్న మల్లయ్య మంగళవారం సెల్ టవర్ ఎక్కా డు. ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని టవర్‌పై ఉన్న మల్లయ్యతో ఫోన్‌లో మాట్లాడి సముదాయించడంతో అతడు కిందికు దిగాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, తనపై వేడి టీ పోశారని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనకు చావే దిక్కని భావించి సెల్‌టవర్ ఎక్కానని అన్నాడు.

కుటుంబ సభ్యులు తిడుతున్నారని సెల్ టవర్ ఎక్కిన వృద్ధుడ