
పత్తి విక్రయించేందుకు స్లాట్ బుక్‌చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించే రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. స్లాట్ బుక్ చేసుకుంటే రైతులు పత్తిని ఏ తేదీన, ఏ మిల్లుకు తీసుకురావాలనే వివరాలు అందులోనే ఉంటాయని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ లేని, ఫోన్ వాడకం తెలియని రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఓటీపీ ద్వారా అధికారులు రైతులకు స్లాట్‌బుక్ చేసి ఇస్తారని, స్లాట్ బుక్ చేసుకోకుంటే సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి విక్రయానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. తేమ శాతం 8కి మించకుండా ఉండేలా చూసుకుని రైతులు కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చి, రూ.8,110 మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు.