
విద్యార్థి అదృశ్యం
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన అక్మత్‌బేగ్ అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. సదరు విద్యార్థి బుధవారం బోధన్‌లోని కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు అతడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి కరామత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బీబీపేటలో ఒకరు..
బీబీపేట: మండల కేంద్రానికి చెందిన బట్టుపల్లి నాగరాజుగౌడ్ (33) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై ప్రభాకర్ బుధవారం తెలిపారు. నాగరాజు గౌడ్ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడి తండ్రి సిద్దరామగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. ఎవరికై న అతడి ఆచూకీ తెలిస్తే పోలీసు స్టేషన్‌లో తెలపాలని ఎస్సై పేర్కొన్నారు.
గాంధారిలో ఒకరు..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన పత్తి బాల్‌రాజు(40) అదృశ్యమైనట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బాల్‌రాజు మంగళవారం ఉదయం ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాల్‌రాజు భార్య పత్తి మేఘన బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

విద్యార్థి అదృశ్యం

విద్యార్థి అదృశ్యం