
పాడి సంపదను పెంచుకోవాలి
డిప్యూటీ కలెక్టర్ రవితేజ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులు వ్యవసాయంతో పాటు పాడి సంపదను పెంచుకోవాలని డిప్యూటీ కలెక్టర్ రవితేజ అన్నారు. దేమికలాన్‌లో బుధవారం నిర్వహించిన పశువైద్య శిబిరానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రైతుల కోసం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోందన్నారు. పశుగ్రాసాన్ని పెంచుకొని పశువులకు ఆహారంగా ఇచ్చినట్లయితే పాల శాతం పెరుగుతుందన్నారు. అనంతరం జిల్లా పశువైద్యాధికారి భాస్కరన్ మాట్లాడుతూ.. రైతులు తమ పశవులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేయించాలన్నారు. లేకుంటే పశువులలో పాలదిగుబడి గణనీయంగా తగ్గి, పశువు పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందన్నారు. గాలికుంటు రోగం వస్తే పశువులకు కాళ్ల గెటికెలు, నోట్లో పుండ్లు అవుతాయని, దీంతో పశువులు మేతమేయక చనిపోయే ప్రమాదముందన్నారు. పశుగ్రాసం ఆవశ్యకత, రకాలు, ప్రభుత్వం ఇస్తున్న గడ్డి విత్తనాల రకాల గురించి వివరించారు.అసిస్టెంటు డైరెక్టర్ శ్రీనివాస్, మండల పశు వైద్యాధికారి రమేష్, వీఎల్‌వో పోచయ్య, జేవీవోలు కొండల్‌రెడ్డి, ప్రేంసింగ్, గోపాల మిత్రలు పాల్గొన్నారు.