
భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
ఎల్లారెడ్డి: ఎల్లారె డ్డి డివిజన్ కేంద్రంలో భవన ని ర్మాణ కార్మిక సంఘం భవన నిర్మా ణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సంఘం నాయ కులు రాష్ట్ర అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్‌కు తరలి వెళ్లిన కార్మిక సంఘం నాయకులు భవన నిర్మాణ రంగాల సంక్షేమ మండలి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకట రమణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. డివిజన్ కేంద్రమైన ఎల్లారెడ్డిలో కార్మి క శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, సంఘం కార్యాలయం కోసం స్థలం కేటాయింపు, ని ర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నేతలు దానబోయిన శ్యామ్, అబ్దుల్ రజాక్, నిమ్మ కృష్ణ, బేల్దార్ తుకారాం, సంఘమేశ్వర్, సాయిలు, పిట్ల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.