
‘టీచర్లతో పాఠశాల తనిఖీ బృందాలు ఏర్పాటు చేయొద్దు’
కామారెడ్డి అర్బన్: ఉపాధ్యాయులతో పాఠశాలల పరిశీలన బృందాల ఏర్పాటు అశాసీ్త్రయ, అవివేకమైన ఆలోచనా విధానమని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర కౌన్సిలర్ విజయరామరాజు ఒక ప్రకటనలో ఆరోపించారు. పాఠశాలల పర్యవేక్షణ, తనిఖీలు, ఉపాధ్యాయుల పనితీరు గమనించే క్రమంలో సహచర ఉపాధ్యాయులపై తనిఖీ బృందాల ఏర్పాటును ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 1,473 మంది టీచర్లతో 165 బృందాలు ఏర్పాటు చేయడం ద్వారా వీరిని పాఠశాల విధులకు దూరం చేయడంతో పాటు, అనేక గొడవలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలను తనిఖీలకు వినియోగించాలని డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ విజయరామరాజు కోరారు.
బాన్సువాడ: బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేష్, అన్నారం మాజీ ఉపసర్పంచ్ మొగుల య్య, బుక్కారెడ్డి, మల్గొండ, మహేంద్ర, ప్రసా ద్, నర్సాగౌడ్ తదితరులు బుధవారం బీజీపీ లో చేరారు. బాన్సువాడ బీజీపీ ఇన్‌చార్జి లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతు న్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి యువత బీజేపీలో చేరుతోందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బీజీపీ బలపడుతుందన్నారు. నాయకులు సాయికిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌గౌడ్, చిదురసాయిలు, కోనాల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బస్టాండు ఆవరణలో బుధవారం షీటీమ్ బృందం సైబర్ నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబరుకు అలాగే 8712686094 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎమర్జెన్సీ ఉంటే 100 నంబరుకు డయల్ చేయాలని సూచించారు. కానిస్టేబుల్ శ్రీశైలం, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో ఈనెల 17, 18 తేదీలలో స్కూల్ గేమ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారి దేవి సింగ్ పేర్కొన్నారు. దీంతో బుధవారం బ్లూబెల్స్ పాఠశాల కరస్పాండెంట్ సంజీవరెడ్డి ఆట పోటీల నిర్వహణ ఖర్చుల నిమిత్తం తన వంతు సహాయంగా రూ.50 వేల చెక్కును స్థానిక ఎంఈవో దేవి సింగ్‌కు అందించారు. ఈ సందర్భంగా ఎంఈవో దేవి సింగ్ మాట్లాడుతూ..క్రీడల నిర్వహణకు సంజీవరెడ్డి రూ.50 వేల విరాళంగా ఇవ్వడం ఎంతో శుభపరిణామమని అన్నారు. ఆట పోటీల నిర్వహణ అధికారి రమణారావు, బ్లూబెల్స్ పీటీ లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

‘టీచర్లతో పాఠశాల తనిఖీ బృందాలు ఏర్పాటు చేయొద్దు’

‘టీచర్లతో పాఠశాల తనిఖీ బృందాలు ఏర్పాటు చేయొద్దు’