
ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన
లింగంపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. బుధవారం ఆయన కొర్పోల్, బోనాల్, బాయంపల్లి, బాణాపూర్, బాణాపూర్ తండా, మెంగారం గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. అలాగే బాయంపల్లి, బాణాపూర్ తండాల్లోని ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): నాణ్యతతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి సూచించారు. బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట కార్యదర్శి ప్రదీప్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన