
ఊపిరి తీసుకోలేక..
విషజ్వరాలు వస్తున్నాయి
బాన్సువాడ : వాతావరణంలో కొద్దిరోజులుగా వస్తు న్న మార్పులతో పసిపిల్లల్లో న్యుమోనియా లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. చలి పెరుగుతుండడంతో చాలా మంది పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. బాన్సువాడ పట్టణంలోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రికి నిత్యం వచ్చే పిల్లల ఓపీ సంఖ్య 200 దాటుతోంది. ప్రతిరోజు 40–50 మంది పిల్లలు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరుతున్నారు. వరుసగా వర్షాలు కురవడం ఆ తర్వాత తీవ్రమైన ఎండ, ప్రస్తుతం చలి వాతావరణంతో పిల్లలు అత్యధికంగా జ్వరం, దగ్గుతోపాటు ఆయాసానికి గురవుతున్నారు.
లక్షణాలు గుర్తించండి ఇలా..
న్యుమోనియా లక్షణాలున్న వారు శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తుల ప్రాంతంలో సొట్టలు కనిపిస్తా యని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు శ్వాస తీసు కునేందుకు ఇబ్బంది పడతారు. సాధారణంగా రెండు నెలల్లోపు పిల్లలు నిమిషానికి 60 సార్లు, ఏడాదిలోపు పిల్లలు 50సార్లు, ఐదేళ్ల లోపు పిల్లలు 40సార్లు, ఐదేళ్ల కు మించిన పిల్లలు 30 సార్లు శ్వాస పీల్చుకున్నారంటే వారిలో న్యూమోనియా లక్షణాలున్నట్లు భావించాలి.
జాగ్రత్తలే రక్ష..
న్యుమోనియా తీవ్రత పెరుగుతున్నా కొద్ది పిల్లలు తీవ్ర ఇబ్బందికి గురవుతారు. చలి మొదలవుతున్న నేపథ్యంలో రోగాలు చిన్నారుల దరి చేరికుండా జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకు చల్లని గాలి తగలకుండా వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. ద్విచక్ర వాహనంపై పిల్లలను తీసుకెళ్తే చల్లనిగాలికి జ్వరం, దగ్గు, ఆయాసం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇబ్బంది పడుతున్న చిన్నారులు
శ్వాసకోశ రుగ్మతలతో
పలువురి అస్వస్థత
కిటకిటలాడుతున్న ప్రభుత్వ,
ప్రయివేటు ఆస్పత్రులు
వాతావరణ మార్పులే కారణం!
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పి ల్లల ఆరోగ్య పరిరక్షణకు తల్లి దండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విషజ్వరాలు వస్తున్నాయి. ఎక్కువగా జ్వరం, దగ్గుతో పిల్లలు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. పిల్లల్లో ఏమాత్రం అనారోగ్య సమస్యలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స ఇప్పించాలి. – రతన్‌సింగ్, పిల్లల వైద్య నిపుణులు,
బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రి

ఊపిరి తీసుకోలేక..

ఊపిరి తీసుకోలేక..