
మద్యం దుకాణాలకు 166 దరఖాస్తులు
కామారెడ్డి రూరల్: జిల్లాలోని మద్యం దుకాణాలకు సోమవారం నాటికి 166 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 49 దుకాణాలుండగా 5 ఎస్సీ, 2 ఎస్టీ, 7 గౌడ సామాజిక వర్గాలకు కేటాయించారు. ఓపెన్ కేటగిరి కింద 35 దుకాణాలున్నాయి. ఈ నెల 18 వరకు దరఖాస్తులను స్వీకరించి, 23న లక్కీ డ్రా నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం వచ్చిన 60 దరఖాస్తులతో కలిపి ఇప్పటి వరకు 166 దరఖాస్తులు వచ్చాయని ఈఎస్ పేర్కొన్నారు. కామారెడ్డి స్టేషన్ పరిధిలో 15 దుకాణాలకు 45, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 దుకాణాలకు 19, బాన్సువాడ స్టేషన్ పరిధిలో 9 దుకాణాలకు 43, దోమకొండ స్టేషన్ పరిధిలో 8 దుకాణాలకు 25, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 10 దుకాణాలకు 34 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
● ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయొద్దని ఎస్పీ రాజేశ్‌చంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట దిగుబడులను రోడ్లపై ఆరబోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారిలో ఎక్కువగా ధాన్యం ఆరబెట్టడం కారణంగా జరిగిన ప్రమాదాల్లో మృతి చెందినవారు ఉన్నారని పేర్కొన్నారు. వాహనాలు అదుపు తప్పడం, ఇతర వాహనాలను ఢీ కొనడం, ధాన్యం వెంబడి కాపలాగా ఉన్న రైతులను ఢీకొనడం లాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ విషయంపై ప్రజలు అవగాహన పెంచుకొని, విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. వడ్లు, మక్కలు, జొన్నలు, ఇతర పంట దిగుబడులను రోడ్లపై ఆరబెట్టవద్దని రైతులకు సూచించారు.
బాన్సువాడ: బాన్సువాడ ఆర్టీసీ డీఎంగా రవికుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు డీఎంగా విధులు నిర్వహించిన సరితాదేవి హైదరాబాద్‌లోని హకీంపేట్ బస్ డిపోకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో జీడిమెట్ల డీఎంగా విధులు నిర్వర్తిస్తున్న రవికుమార్ బదిలీపై బాన్సువాడ డీఎంగా వచ్చారు.

మద్యం దుకాణాలకు 166 దరఖాస్తులు