
జోరందుకున్న పంట కోతలు
ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి 2005–06 బ్యాచ్ విద్యార్థులు
తిమ్మాపూర్ ఉన్నత పాఠశాల పదో తరగతి 1999–2000 బ్యాచ్ విద్యార్థులు
● కల్లాల్లో శ్రమిస్తున్న రైతులు
డొంకేశ్వర్(ఆర్మూర్): వర్షాల తగ్గుముఖం పట్టి నేల గట్టిపడడంతో జిల్లా వ్యాప్తంగా పంట కోతలు ఊపందుకున్నాయి. సోయా, మొక్కజొన్న కోతలు జోరుగా సాగుతున్నాయి. దీంతో హార్వెస్టర్లకు గిరాకీ పెరిగింది. మొక్కజొన్న కోతకు గంటకు రూ.4వేలు, సోయాకు రూ.2,600 వరకు రైతుల వద్ద కిరాయి తీసుకుంటున్నారు. పంట దిగుబడులను నేరుగా ట్రాక్టర్లలో తీసుకొచ్చి కల్లాలు, రోడ్లపై ఎండబోస్తున్నారు. పంటను త్వరగా అమ్ముకునేందుకు రైతులు కల్లాల వద్దే తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంకా మక్క, సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో కొన్ని చోట్ల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం త్వరగా కేంద్రాలను తెరవాలని రైతులు కోరుతున్నారు.

జోరందుకున్న పంట కోతలు