
రైల్వే పోలీసుల అదుపులో అనుమానాస్పద వ్యక్తులు
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫారాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్‌పీఎస్ ఎస్సై తెలిపారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రైల్వే పోలీసులు తనిఖీ చేస్తుండగా ఫ్లాట్‌ఫారమ్–1 వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న గంగాప్రసాద్ విశ్వంభర గైక్వాడ్, అమోల్ విశ్వంభర గైక్వాడ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు పాత నేరస్తులుగా గుర్తించారు. వీరు మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కూలీ పనులు చేసేవీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా గతంలో పలు నేరాలు చేసినట్లు వారు ఒప్పుకున్నారు. వీరి నుంచి విలువైన ఫోన్లు, రూ.18,700 నగదును స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చనున్నట్లు రైల్వే ఎస్సై తెలిపారు.